మనకి ఏదైనా జరగడం...కాస్త చాదస్తం ఉన్నోళ్లు " బెమ్మంగారు ఎప్పుడో చెప్పాడ్రా అబ్బాయ్ " అనడం గమనించే ఉంటాం..తాజాగా ఇంగ్లండ్‌లో కొన్నాళ్లుగా మిస్టరీగా మారిన కేట్ మిడిల్టన్( ఈమె వేల్స్ ప్రిన్సెస్) సమాచారం
ఇప్పుడు మరో విషయంతో సంచలనం కలుగుతోంది. ఈమెకి కేన్సర్ సోకినట్లు స్వయంగా ఓ వీడియోలో చెప్పింది
దీంతో ఫ్రెంచ్ ఆస్ట్రాలజర్ నోస్ట్రడామస్ 15వ శతాబ్దంలోనే..ఇంగ్లండ్ రాజకుటుంబంలో ఇలా జరుగుతుందని చెప్పారంటూ కొన్ని
పత్రికలు..టాబ్లాయిడ్స్..సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
2022లో క్వీన్ ఎలిజబెత్ -2 చనిపోతుందని..యువరాజు పట్టాభిషేకం జరుగుతుందని..ఇంకా ఇలాంటి సంఘటనలను
ఆయన తన జ్యోతిష్యంలో రాసినట్లు కొందరు ఎక్స్‌జనులు ఆధారాలంటూ కొన్ని ఫోటోలతో హోరెత్తిస్తున్నారు. యువరాజుకు
కేన్సర్ వస్తుందని అందులో రాయగా..నిజంగానే ఫిబ్రవరిలో కింగ్ చార్లెస్ -3 కేన్సర్ సోకినట్లు ప్రకటన వచ్చింది. ఈ కోవలోనే
కేట్ మిడిల్టన్‌కి కూడా ఇలా జరుగుతుందని నోస్ట్రడామస్ రాసారట..ఇదే నిజమైందంటూ ఆయన భక్తులు(జ్యోతిష్యంపై ఆపాదకులు)
ఇప్పుడు హడావుడి ప్రారంభించారు
Comments
Post a Comment