స్టాక్ మార్కెట్లు మంచి ఊపుగా ట్రేడవుతున్నాయ్. నిఫ్టీ ఇంట్రాడేలో 160 పాయింట్ల వరకూ లాభపడింది.దీంతో బుల్స్ ఆర్ బ్యాక్ అనే ఉత్సాహం మార్కెట్లలో కన్పిస్తోంది. సెన్సెక్స్ 500 పాయింట్లకిపైగా లాభంతో ర్యాలీ చేయగా, బ్యాంక్ నిఫ్టీ అరశాతం లాభపడింది. ఐటీ ఇండెక్స్ పావుశాతం లాభపడింది
కేపిటల్ గూడ్స్ రెండుశాతం వరకూ దంచికొట్టగా, ఆటో సెక్టార్ ఒకశాతం వరకూ ర్యాలీ చేసింది.
ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు కూడా కేకపుట్టించే పనిలో పడగా, పిఎస్ఈ షేర్లు అరశాతం వరకూ
లాభపడ్డాయి.
నిఫ్టీప్యాక్‌లో మారుతి సుజికి, రిలయన్స్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, ఐషర్ మోటర్స్ ఒకటిన్నర నుంచి మూడుశాతం వరకూ లాభపడగా, అపోలో హాస్పటల్, బ్రిటానియా, హీరోమోటోకార్ప్, యుపిఎల్, డా.రెడ్డీస్ ల్యాబ్స్ అరశాతం నుంచి ఒకశాతం వరకూ నష్టపోయాయ్
Comments
Post a Comment