వడ్డీ రేట్లు పెంచిపారేసిన HDFC,పేనాల్ ఛార్జీలతో యాక్సిస్


రిజర్వు బ్యాంక్ ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 5 వరకు జరుగనున్న తరుణంలో వడ్డీ రేట్ల పెంపు ప్రకటనను బ్యాంక్ వెల్లడించింది. ఇది కొత్త ఆర్థిక సంవత్సరంలో మొదటి మీటింగ్ కావడంతో..నిర్ణయంఎలా ఉంటుందనేది ఆసక్తి కలిగిస్తుండగా..HDFC బ్యాంక్ చప్పుడు లేకుండా..హోమ్ లోన్ వడ్డీ రేట్లను పెంచేసింది

 రెపో-లింక్డ్ హోమ్ లోన్ వడ్డీ రేట్లను 10-15 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెంపుతో వడ్డీ రేటు 8.70 శాతం నుంచి 9.8 శాతానికి చేరుకుంది. జూలై 1, 2023న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి విలీనం కారణంగా గృహ రుణ రేటులో మార్పు జరిగింది. ఇకపై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్‌కి లింక్ చేయబడదని బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో చెప్తుండగా. కొత్త రెపో లింక్డ్ వడ్డీ రేటు కొత్త కస్టమర్లకు వర్తిస్తుందని, పాత కస్టమర్లు RPLRతో కొనసాగవచ్చని తెలుస్తోంది.మరోవైపు యాక్సిస్ బ్యాంక్ .పేనాల్టీ ఇంట్రస్ట్‌ని పేనాల్టీ ఛార్జీలుగా మార్చుతూ నిర్ణయం ప్రకటించింది. 

Comments