స్టాక్ మార్కెట్లు మొమెంటమ్ కొనసాగిస్తున్నాయ్. నిన్నటి గరిష్టాలకు దగ్గరగా ఇవాళ
నిఫ్టీ వచ్చింది. 22727 పాయింట్ల వరకూ పెరిగింది.
సెన్సెక్స్ 74983 పాయింట్ల వరకూ పెరిగింది.
ముఖ్యమైన సెక్టార్లలో బ్యాంక్ నిఫ్టీ పావుశాతం లాభపడగా
ఐటీ ఇండెక్స్ ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. హెల్త్ కేర్ మినహా అన్ని రంగాలు
లాభాల్లో ట్రేడవుతుండగా..మెటల్ సెక్టార్ రెండుశాతం..ఆయిల్ అండ్ గ్యాస్
రెండున్నరశాతం దంచికొట్టేశాయ్.పిఎస్ఈ షేర్లు కూడా 2శాతం వరకూ లాభపడ్డాయి
నిఫ్టీలో బిపిసిఎల్,కోల్ఇండియా,హిందాల్కో, టక్ మహీంద్రా, టెక్ మహీంద్రా ఒకటిన్నర
నుంచి మూడున్నరశాతం లాభపడగా, దివీస్ ల్యాబ్స్, హెచ్‌డిఎఫ్‌సిలైఫ్, సిప్లా
ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, సన్‌ఫార్మా ముప్పావుశాతం నుంచి రెండుశాతం వరకూ
నష్టపోయాయ్
Comments
Post a Comment