Q4లో లోన్ల మంజూరు భారీగా సాగినట్లు కంపెనీ ప్రకటించిన తర్వాత
ఆవాస్ పైనాన్షియర్స్ షేర్లు 10 శాతం లాభపడ్డాయి. శుక్రవారం నాటిట్రేడింగ్‌లో
రూ.1596 ధరని తాకాయి. ఇది ఈ స్టాక్ గతఐదేళ్లలో 3శాతం సార్లు మాత్రమే( అంటే ప్రతి వంద సెషన్లలో 3 సార్లు) 5శాతానికిపైగా లాభపడగా..వాటిలో ఇది ఒకటి..
స్మాల్ క్యాప్ సెగ్మెంట్‌లో ఉన్న ఈ కంపెనీ..ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే
20శాతం వృద్ధితో రూ.1890కోట్ల విలువైన ఋణాలను మంజూరు చేసింది
మార్చి నెలాఖరుకు రూ.17300కోట్ల అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ సాధించగలిగింది
దేశవ్యాప్తంగా ఈ కంపెనీకి 367 శాఖలు ఉఁడగా..వాటిలో 21 బ్రాంచులు గడచిన మూడు నెలల్లో
ప్రారంభించినవే..!
Comments
Post a Comment