ఓ బెంగళూరు లేడీ టెకీ..తన ఉద్యోగం కాకుండా స్విగీ డెలివరీ ఏజెంట్‌గా మారి తన
ఎక్స్‌పీరియెన్స్ షేర్ చేసుకుంది. నమ్రతాసింగ్ అనే ఈ లేడీ..స్విగీ ఫుడ్ డెలివరీ
సేఫ్‌గా ఉండేందుకు చేసిన ఏర్పాట్ల గురించి లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేసింది.
9ఏళ్లపాటు ప్రొడక్ట్ మేనేజ్‌ర్గా పని చేసిన నమ్రత అభిప్రాయం ప్రకారం,
స్విగీ, జొమేటో, బ్లింకిట్, ఓలా దేశంలో చాలా ఉద్యోగాలు క్రియేట్ చేశాయ్.ఎకానమీకి
ఇది ఉపయోగమని..తక్కువ చదువు ఉన్న యువత ప్రత్యేకించి దీంతోఉపాధి పొందుతారనే
ఆభిప్రాయాన్ని చెప్పింది.
ఓ ఏజెంట్ డెలివరీ తీసుకునే ముందు..తన లొకేషన్ నుంచిహోటల్‌కి..హోటల్ నుంచి కస్టమర్ డెలివరీ
పాయింట్‌కి ఎంత దూరం ఉన్నదనే విషయంముందే డివైజ్‌లో తెలుస్తుందట..అలానే ఎంత కమిషన్
సదరు డెలివరీ ఏజెంట్‌కి వచ్చేదీ కూడా ముందే తెలుస్తుందని నమ్రత చెప్పింది.డెలివరీలొకేషన్ చేరగానే
ఆ ఫోటో ఒకటిపోస్ట్ చేయాల్సిఉంటుందని ఇది..డెలివరీ ఖచ్చితంగా ముందు కస్టమర్ పెట్టిన లొకేషన్‌కే
అందినట్లు తెలిపే మరో సేఫ్‌గార్డ్ అని ఆమె చెప్పుకొచ్చింది. ఏతావాతా చూస్తే..ఇది స్విగీ ప్రమోషన్
పోస్ట్‌లా ఉన్నా కూడా...ఓ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఎలా జరుగుతుందనే విషయంపై కాస్త
అవగాహనకి వచ్చేలాఉంది
Comments
Post a Comment