సేమ్ ప్యాట్రెన్..ఫ్లాట్ ట్రేడింగ్


స్టాక్ మార్కెట్లు నిన్నటిలానే ట్రేడవుతున్నాయ్. గతముగింపు కంటే

నిఫ్టీ ఓ పది పాయింట్లు మాత్రమే పెరిగి మరో పది పాయింట్లు తగ్గింది.

నికరంగా 22450 పాయింట్లకు అటూ ఇటూగా ప్రస్తుతం ట్రేడవుతోంది


సెన్సెక్స్ కంఫర్టబుల్‌గా 74వేల పాయింట్ల దిగువన ఫ్లాట్‌గా ట్రేడవుతోంది


బుధవారం నాటి ట్రేడింగ్‌లో బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్‌గా ట్రేడవుతుండగా, ఐటి ఇండెక్స్ ఒకశాతం లాభపడింది

మెటల్,ఆయిల్ అండ్ గ్యాస్, టెక్నాలజీ, పిఎస్ఈ షేర్లు అరశాతానికిపైగా లాభంతో ట్రేడవుతున్నాయ్


నిఫ్టీ టాప్ గెయినర్లుగా దివీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా,టిసిఎస్, శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో ఒకటింబావు నుంచి

2శాతం వరకూ లాభపడ్డాయ్. నిఫ్టీలో ఇఁక్లూడైన తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్‌కి ఇది తొలి లాభాల సెషన్


నెస్లేఇండియా, బ్రిటానియా, బజాజ్ఆటో, HDFC లైఫ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఒకటింబావు నుంచి మూడుశాతం

వరకూ నష్టపోయాయ్

Comments