iPhone స్టోర్లు,అసెంబ్లింగ్ యూనిట్ మన దేశంలోనే పెట్టడంతో..యాపిల్ ఫోన్లకు
మన దేశం మూడో మార్కెట్ ప్లేస్ కానుంది. అమెరికా,చైనా,జపాన్, యూకేలో
ఐఫోన్ అమ్మకాలు ఎక్కువ.. ఆ తర్వాతి స్థానం ఇండియాదే..! కౌంటర్ పాయింట్ రీసెర్చ్
లెక్కల ప్రకారం 2026నాటికి యుకేలోని ఆపిల్ ఫోన్ల అమ్మకాల కంటే మన దగ్గరే ఎక్కువ ఉంటాయి
మన దేశంలో ఆపిల్ ఫోన్ స్టోర్లు ప్రారంభించి రెండేళ్లు అయింది. ముంబై, న్యూఢిల్లీలో మాత్రమే
ఈ స్టోర్లు ఉండగా, ఐఫోన్లకి డిమాండ్ ఇంకా పెరుగుతూనే ఉంది. మనదేశంలోని ప్రస్తుత స్మార్ట్ ఫోన్
యూజర్లు కొత్త ఉత్పత్తులు..అవి అందించే సౌకర్యాలపై ప్రత్యేక అభిరుచి కలిగి ఉన్నారని..అందుకే
ఆపిల్ ఫోన్లని ఖరీదైనా సరే కొనుగోలు చేస్తున్నారని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ చెప్పింది. అంతేకాదు
యువత చేతిలో కనీసం మూడు నాలుగు స్మార్ట్ ఫోన్లు కన్పిస్తున్నాయని తన పరిశీలనలో పొందుపరిచింది
ఇదే ఊపులో ఐఫోన్ మరో స్టోర్ ఓపెన్ చేసినా సరిపడేంత డిమాండ్ ఉన్నట్లు అర్థమవుతోంది
ఈ క్రమంలో..రాబోయే రెండేళ్లలో సేల్స్ భారీగా నమోదు అవుతాయని CPR ఢంకా బజాయించింది
Comments
Post a Comment