చరిత్రలో ఇది ఎరుగం...అన్ని రికార్డులు దాటేసిన బంగారం


ఓ వైపు మార్కెట్లు గరిష్టస్థాయిల దగ్గర ట్రేడవుతుంటే

బంగారంకూడా మరింత షైనవుతోంది. ఇది ఓరకంగా చరిత్రే..అసెట్ క్లాస్

విషయంలో ఈక్విటీ మార్కెట్లలోడౌన్ ట్రెండ్ ఉన్నప్పుడే ఇలా గోల్డ్ వైపు

ఇన్వెస్టర్లు పరుగులు తీస్తుంటారని చెప్తుంటారు..కానీ ఈ రోజు గోల్డ్ మరో

బెంచ్ మార్క్ సెట్ చేసింది..ఔన్స్ గోల్డ్ రేటు 2300 డాలర్లను దాటేసింది


అమెరికా ఫెడరల్ బ్యాంక్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ , వడ్డీరేట్లను తగ్గిస్తామని

నిన్న భరోసా ఇస్తామని  చెప్పిన నేపథ్యంలోనే ఈ జంప్ కన్పిస్తోంది. ఔన్స్ గోల్డ్ రేటు

2304.96 డాలర్లకు చేరింది. మరి అసలే పసిడిప్రియులైన మనోళ్లు ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్‌లో

పడిపోయారు..రేటు ఎంతైనా సరే..ఓ తులమైనా లేనిదే మనదగ్గర శుభకార్యాలకు అర్ధం ఉండదు కాబట్టి...

మన దగ్గరా అంబ పలుకుతోంది..అలా చూసినప్పుడు గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలకు పండగే అని చెప్పాలి

ఓ వైపు రేటు పెరుగుతుంటే..మార్జిన్ మనీకి ఢోకా ఉండదు..మరోవైపు ఎక్కువ డబ్బు అప్పు రూపంలో పుడుతుండటంతో..

జనం కూడా ఈ NBFC కంపెనీలవైపు చూడటం ఎక్కువ అవుతుంది..ఐతే ఈ రేట్లకు.. చేతిలో చాలినంత డబ్బు లేకుండా

శుభకార్యాలకు బంగారం కొనేవాళ్లకే  మైండ్ బ్లాక్ అవుతోంది


ఔన్స్ అంటే 31 గ్రాములకు కాస్త ఎక్కువ

Comments