టెక్నాలజీ దిగ్గజం టెస్లా..ఇప్పటిదాకా ఆటోమేటిక్ కార్లను సొంతానికి మాత్రమే వినియోగిస్తుండగా
కమర్షియల్ పర్పస్ కోసం కూడా ట్యాక్సీ రూపంలో అమ్మకానికి పెట్టనున్నారు. ఇందుకోసం ఆగస్ట్ 8న ముహూర్తంగా ఎలాన్ మస్క్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయనే స్వయంగా ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు
ఈ ప్రకటన తర్వాత టెస్లా షేర్లు మూడు శాతం వరకూ లాభపడ్డాయ్.
25వేల డాలర్ల బడ్జెట్‌లో ఓ ఎలక్ట్రిక్ కార్‌ని టెస్లా లాంఛ్ చేయబోతుందని గతంలో వార్తలు వచ్చాయ్.ఐతే దాన్ని మస్క్ పక్కనబెట్టేశారంటూ రాయిటర్స్ కథనం ప్రచురించిన నేపథ్యంలో తాజా పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. 2019 ఏప్రిల్‌లోనే టెస్లా ఓ రోబో ట్యాక్సీని ఏడాది కాలంలోగా రోడ్లపైకి తెస్తానని చెప్పింది. ఆగస్ట్ 8 నాటికి ఈ ట్యాక్సీలను గనుక తీసుకువస్తే.. అదో రికార్డే..!
ఈ కార్ల అమ్మకాల ద్వారా కంపెనీకి ఒక్కో కారుపై ఏడాదికి 30వేల డాలర్ల లాభం వస్తుందని ఓ అంచనా.
Comments
Post a Comment