ట్రంప్ నోబెల్ పిచ్చి పీక్స్ ?

 ట్రేడ్ టాక్స్ పేరుతో..అవార్డ్ లాబీయింగ్?  ట్రంప్ నోబెల్ పిచ్చి పీక్స్ ?


అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వైఖరి మరీ విచిత్రంగా మారిపోతోంది. ఇప్పటికే అనేకసార్లు

తానేదో పెద్ద శాంతిదూతలా మాట్లాడుతూ అభాసుపాలైన ట్రంప్..మరోసారి అదే పాట పాడారు

ఆరునెలల్లో ఆరు యుద్ధాలను ఆపానని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా పాక్ ఇండియా అణుయుద్ధానికి సిద్ధమైతే తన జోక్యంతోనే వార్ ఆగిపోయిందంటూ గొప్పలు చెప్పుకొచ్చారు. ఇది ఒకసారైతే ఓకే అనుకోవచ్చు..కానీ ఇన్నిసార్లు ఇలా చెప్పడం ఖచ్చితంగా ఆయన పైత్యానికి నిదర్శనమే 

 ఇది ఇలా ఉండగానే..మరో ప్రచారం కూడా కలకలం రేపుతోంది. నార్వే దేశంతో

తాను విధించిన సుంకాలతో జులైనెలలో చర్చలు జరిపారట.. నార్వే ఆర్ధికమంత్రి జెన్స్ స్టోల్టెన్‌బర్గ్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ తన మనసులో మాట బైటపెట్టేసినట్లు చెప్తున్నారు. సుంకాల సంగతి మాట్లాడుతూనే సందట్లో సడేమియాలాగా తనకి నోబెల్ ప్రైజ్

కావాలని అడిగారట. డాజెన్స్ నారింగ్స్‌లైవ్ అనే ఓ నార్వే పత్రిక ఈ మేరకు ఓ కథనం ప్రచురించింది. ఈ స్టోరీ రాగానే ట్రంప్‌కి నోబెల్ అంటే ఇంత పిచ్చేంటి అంటూ జోకులు వేసుకుంటున్నారు. నిజానికి ట్రంప్ ఏ యుద్ధాన్ని ఎలా ఆపారో ఆయన చెప్పడమే కానీ..ఇతర దేశాలు నిర్ధారించింది ఒక్క ఇరాన్-ఇజ్రాయెల్ వార్ విషయంలోనే..అసలా యుద్ధం కూడా

ట్రంప్ ఇజ్రాయెల్‌ని ఎగదోసి చేసిందే ! ఇలాంటి స్థితిలో ట్రంప్ తనకి తాను శాంతిదూతని అని చెప్పుకోవడంపై జోకులు పేలుతున్నాయి కానీ ఆయన మాత్రం దాన్నసలు కేర్ చేయడం లేదు..పట్టించుకుంటే ఆయన ట్రంప్ ఎందుకవుతారు?

Comments