వాళ్లూ వాళ్లూ బానే ఉన్నారు..మధ్యలో రాజన్న మంత్రి పదవి ఊడింది

 


అప్పోజిషన్ పార్టీల ఎంపిల ధర్నాతో దద్దరిల్లిన ఢిల్లీ

 పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలతో ఊడిన  కర్నాటక మంత్రి పదవి

 కర్నాటకలో మంత్రిపదవి నుంచి తప్పుకున్న రాజన్న

ఢిల్లీలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ సహా పలువురు విపక్ష ఎంపిలు పార్లమెంట్ నుంచి

ఈసీ కార్యాలయం వరకూ చేపట్టిన నిరసన కార్యక్రమంతో హోరెత్తిపోయింది..ఈ సందర్భంగా

రాహుల్ , ప్రియాంక గాంధీ సహా పలువురునేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

ఇంతవరకూ బానే ఉంది..కానీ ఈ మధ్యనే బెంగళూరులో రాహుల్ గాంధీ..ఓ వీడియో ప్రజెంటేషన్ చేసి ఈసీకి కొన్ని ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలోనే సోమవారం నాటి నిరసన కార్యక్రమం

భారీ ఎత్తున నిర్వహించగా..ఈసీ రాహుల్ గాంధీని తాను లేవనెత్తిన సందేహాలను డాక్యుమెంట్ల రూపంలో సమర్పించాలని కోరింది.  ఇదిలా సాగుతుండగానే కర్నాటక మంత్రి రాజన్నని హైకమాండ్ ఆదేశాలతో తొలగించిన వ్యవహారం కూడా కలకలం రేపింది

కర్నాటకలోని ఓటర్ల జాబితాలోని అవకతవకలకు అధికారంలో ఉన్న తామే కారణం అన్నట్లుగా స్పందించారాయన. దీనిపై రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సహా ఇతర కర్నాటకలీడర్లు కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన్ని పదవి నుంచి దిగిపోవాలనే

డిమాండ్ రాగా..సిఎం సిద్దరామయ్యకి ఆయన తన రాజీనామా సమర్పించడం..దాన్ని ఆమోదించడం వెంటవెంటనే జరిగిపోయాయ్

ఇది చూస్తే..మీకో సామెత గుర్తొస్తే అది రాహుల్ తప్పు కాదు..రాజన్న తప్పు అసలే కాదు



Comments