అమెరికాకి కరెక్ట్ మొగుడు చైనానేనా

 టారిఫ్‌ల అమలుపై తారీక్లు అార్ధం అదేననుకుంటా

భారత్‌ని సుంకాల పేరుతో హంట్ చేస్తోన్న అమెరికా..చైనాని మాత్రం వదిలిపెడుతోంది

ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ పోతోంది. రష్యా నుంచి భారత్ క్రూడాయిల్ కొంటున్నది కాబట్టే...ఉక్రెయిన్ యుద్ధం ఆగడం లేదంటూ ట్రంప్ చేస్తోన్న ఆగడానికి అస్సలు లాజిక్ లేదు..దానికి ఇదే నిదర్శనం. లేకపోతే..చైనాపై ఆగస్ట్ 11 నుంచే

అమలు కావాల్సిన సుంకాలను మరో మూడునెలలు వాయిదా వేసింది అమెరికా..! 

నిజానికి అమెరికా-చైనా ట్రేడ్ వార్ మిగిలిన ప్రపంచానికి కూడా కీడు చేసేదే కానీ..ఇతర దేశాలపై సుంకాల పోటు వేసే ట్రంప్..చైనా జోలికి పోవాలంటే మాత్రం బెదిరిపోతారు. అందుకోసమే మే నెల నుంచి ఇప్పటిదాకా మూడుసార్లు సుంకాల అమలు వాయిదా వేసారు. దీంతో ఈ రెండు దేశాలు చక్కగా తమ వాణిజ్యాన్ని కొనసాగించుకుంటుంటే ఇతర దేశాలు మాత్రం ట్రంప్ టారిఫ్‌తో సతమతం అవుతున్నాయ్. రష్యా నుంచి చమురు కొనే బ్రెజిల్‌పై, భారత్‌పై 50శాతం సుంకం వసూలు చేయనుండగా..చైనా మాత్రం ఎలా తప్పించుకోగలుగుతుంది ?

కీలక ఖనిజాలు, ఎలక్ట్రిక్‌ వాహనాలు మొదలు జెట్‌ విమానాల ఇంజన్ల వరకు వాడే మాగ్నెట్లపై 

చైనా ఆధిపత్యం ఉండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఈ ఏడాది మేలో చైనా ఉత్పత్తులపై  145 శాతం టారిఫ్‌లను ట్రంప్‌ ప్రకటించగా, అమెరికా ఉత్పత్తులపై డ్రాగన్‌ దేశం 125శాతం టారిఫ్‌‌లను విధించింది.  అనంతరం, రెండు దేశాలు వెనక్కి తగ్గి, జెనీవాలో చర్చలు మొదలుపెట్టాయి. అప్పట్నుంచి అవి అలా సాగుతూనే ఉన్నాయ్.


 అమెరికాతో చైనా మూడో అతి పెద్ద ట్రేడ్ భాగస్వామి..మెక్సికో, కెనడా తర్వాత చైనా తయారీ గూడ్స్‌పైనే అమెరికా ఆధారపడింది. వాషింగ్ మెషీన్స్, టివి..క్లాత్స్ ఇలా ప్రతి రంగంలో చైనా ఆధిపత్యం కొనసాగుతుంది. .ఇంకా అమెరికా చైనా నుంచి దిగుమతులు భారీగా పెరగడంతో..టారిఫ్‌ల దెబ్బ అమెరికాకే ఎక్కువ తగలనుంది

దానికి తోడు డ్రాగన్ కంట్రీ తన కరెన్సీని కావాలనే బలహీనపరుస్తుందనే వాదన ఉంది..ఇలా యువాన్ల మారకపు విలువని పడేయడం ద్వారా చైనాకి ఎక్కువ కరెన్సీని అమెరికా సంస్థలు చెల్లించుకోవాల్సి వస్తుంది..ఈ కోణంలోనూ చైనాపై అమెరికా దూకుడుగా వెళ్లలేదు. ఇదే భారత్ అయితే..అమెరికా నుంచి చేసుకునే దిగుమతులే ఎక్కువ కావడంతో..మనమా

పని చేయలేం..ఇది అవకాశంగా తీసుకుని భారత్‌ని తాము చెప్పినట్లు ఆడించాలనేది ట్రంప్ ప్లాన్ కాగా.. కేంద్రం దానికి అస్సలు తగ్గలేదు.అందుకే వెంటబడుతున్నట్లుగా అమెరికా సుంకాలు పెంచేసింది.చైనాని మాత్రం వదిలేసింది

Comments