శభాష్ జగన్...అదీ మాటంటే..సౌండ్ లేని బాబు..పోలా..అద్దిరిపోలా


" నాకూ చంద్రబాబుకీ తేడా ఏమంది అన్నా"

ఓ ఐదుగురు ఎమ్మెల్యేలను లాగేస్తే టిడిపికి ప్రతిపక్షహోదా కూడా దక్కదు అన్నారు కానీ..అలా చేస్తే నాకు బాబుకి తేడా ఏముంది..నా పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలి..ఇదీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా చేసిన తొలి ప్రసంగం..అద్దిరిపోయింది కదూ..

ప్రతిపక్షానికో క్లియర్ మెసేజ్..జనాలకో సూటిగా సంకేతం ఇక్కడే పంపేశాడాయన..ఎమ్మెల్యేలను కాజేయాల్సిన అవసరం లేదు..అవసరం ఉన్నా..వద్దనుకోవడమే జగన్ నైజం..పార్టీలు మారే ఎమ్మెల్యేలకు పాపం ఈ డైలాగ్ నచ్చి ఉండదు..టిడిపి మాత్రం కాస్త సంతోషపడి ఉంటుంది..అమ్మయ్య మాకు ఓ క్యాబినెట్ ర్యాంక్ ఉందిలే అని..

అసెంబ్లీలో ప్రతిపక్షానికి కూడా వాయిస్ ఇస్తాం అని జగన్ చెప్పడం అభినందనీయం..అలానే ఆచరణలో కూడా చూపించాలి..అలానే స్పీకర్ కి ఫ్రీ హ్యాండ్ ఇస్తామని చెప్పడం కూడా హర్షణీయం. పాపం జగన్ ఈ మాట అంటుంటే కెమెరా బాబువైపు తిప్పగానే ఆయన అచ్చెనాయుడివైపు తిరగడం చూస్తుంటే జాలి వేయకతప్పదు..కానీ పిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చిన పాపం ఊరికే పోదు కదా..అనుభవించాల్సిందే..

చివరకు చంద్రబాబుని ర్యాగింగ్ చేస్తారేమో అని టిడిపి సభ్యులంతా టెన్షన్‌గా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనుకున్నట్లుగానే..అసెంబ్లీలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బాబుని టార్గెట్ చేసి మాటలు తూటాలు వదలడం..దానికి ఆయన ఉడుక్కోవడం  కూడా తటస్థించింది..ఇదే ఇక రానున్న రోజుల్లో అసెంబ్లీ ఎలా జరగబోతోందో చెప్తోంది

Comments

 1. "పాపం జగన్ ఈ మాట అంటుంటే కెమెరా బాబువైపు తిప్పగానే ఆయన అచ్చెనాయుడివైపు తిరగడం చూస్తుంటే జాలి వేయకతప్పదు"

  సీనియర్ మోస్ట్ నాయకుడు అద్దంకి శాసనసభ్యుడు కరణం బలరాం గారిని వదిలేసి అచ్చన్నను పక్కన కూచోబెట్టుకున్నాడేమిటి చెప్మా.

  ReplyDelete
  Replies
  1. Please read as చీరాల instead of అద్దంకి in above comment.

   Delete
 2. మీ తెలంగాణ మీరు పట్టుకుపోయాక కూడా సిగ్గులేకుండా ఆంధ్రా రాజకీయాలు మీకెందుకు.

  ReplyDelete
  Replies
  1. మీ పచ్చదళం కర్ణాటకలో శబ్దభేరి మోగిస్తామని దూరారు. తెలంగాణాలో విగ్గులు పెట్టుకొని మరీ బుల్బుల్ రాగాలు ఆలకించారు. ఢిల్లీలో చక్రం తిప్పుతామంటూ కులగజ్జి మీడియా సాక్షిగా రంకెలేసారు. ఇంత బతుకు బతికి ఇంటెనక చచ్చినట్టు ఆంధ్రా జనం ఛీ కొట్టారు.

   గురువింద గింజకు తన నలుపు తెలియదట.

   Delete
  2. మీ గులాం గ్యాంగ్ కారు -సారు -పదహారు అన్నపుడు మీ "కారు" నలుపు గుర్తుకురాలేదా ? ఏ మొఖం పెట్టుకుని విమర్శిస్తున్నారు ?

   Delete

Post a comment