యలమంచిలి సత్యనారాయణ వర్సెస్ ఏపీ బిజెపి..ఎవరు గెలుస్తారు..?

సుజనా చౌదరి ఉరఫ్ యలమంచిలి సత్యనారాయణ గారు ఖచ్చితంగా రాజధాని తరలింపులో కేంద్రం హస్తం ఉండాలంటారు..బిజెపినేమో..(ఏపీ ) తరలించకూడదనేదే పార్టీ వైఖరి కానీ..ప్రభుత్వానికి అందులో బాధ్యత కానీ..ప్రమేయం కానీ ఉండదని అంటోంది..రెండు వైరుధ్య భావాలు..అభిప్రాయాలు అనుకోవచ్చు..కానీ రెండూ ఒకటే..
అమరావతిలోనే రాజధాని ఉంటే..సుజనా అండ్ కో కి లాభం..తరలిస్తే...వైజాగ్ పరిసర ప్రాంతాల్లోని వారికి లాభం..ప్లస్  అక్కడే కాస్తో కూస్తో బిజెపికి బలం ఉంది..ఈ రెండు అంశాలే ఇప్పుడు ఏపీ రాజధానిపై బిజెపి వైఖరిని శాసించబోతున్నాయ్.. అంతే కానీ పార్టీగా బిజెపికి ఇందులో ఓ స్టాండ్ అంటూ లేదని తేలిపోయింది..పైగా కేంద్రం జోక్యం చేసుకోవచ్చుగా అనే వాదనని కూడా కొట్టిపారేయడమే అసలు వ్యూహం..

ఏం చేసినా..అది మన చేతికి మట్టి అంటకూడదు..లాభం ఏదైా ఉంటే అది పంచుకోవాలి..నష్టం చేసినవారికే పూర్తిగా దఖలు పడాలి..రాజధాని తరలించిన తర్వాత పార్టీకి లాభించిందా..అందుకే మేం జోక్యం చేసుకోలేదని చెప్పొచ్చు.

.కానీ  మధ్యలో మన భూముల రేట్లు ఎలా..ఇదే పాపం ఇప్పుడు తరలించవద్దు  అనే నేతల  అసలు బాధ

Comments