ఇప్పటిదాకా దేశంలో ఎవరూ చేయనివి..చేయలేనవి చేయడానికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పోటీ పడుతుంటారు..అందులో భాగంగానే బిల్‌గేట్స్‌ని వైజాగ్ ఆగ్రిటెక్ సమిట్ కి రప్పించగలిగారు. మిలిందా గేట్స్ ఫౌండేషన్ పేరుతో ప్రపంచమంతా హెపటైటిస్ బి వేక్సిన్లు వేయించారు. అందులో ఎవరికెంత వాటాలు(మనోళ్లకి కాదు..వరల్డ్ లాబీయింగ్ గ్రూప్)కి దక్కిందనేది ఎవరికీ తెలీదు..ఇప్పుడా ఫౌండేషన్ ఏ సెక్టార్‌లో సర్వీస్ చేస్తుందీ తెలీదు..ఐతే ఇప్పుడా బిల్‌గేట్స్ యెగసాయానీకీ సాయం చేస్తానంటూ బైల్దేరాడు..సరే ఇదోరకం కార్పొరేట్ యెగసాయం అనుకుందాం...పంటపొలాల్లో కేపిటల్ కడుతున్ననాడే మనకి భూములు..వ్యవసాయం, ఆధునిక పద్దతులు అన్న విషయాలపై మాట్లాడే హక్కు పోయింది ఇప్పుడు తరతరాలనుంచీ చేస్తోన్న వ్యవసాయానికి కూడా
టెక్నాలజీ సాయం అవసరమైంది.. అంగుళం భూమిలో ఎకరం పంట పండించే ఇజ్రాయిల్ తరహా సేద్యం ఇకపై
అమరావతిలో వేళ్లూనుకున్నా..కోవచ్చు కానీ...ఏపీ పర్యాటక శాఖ కూడా ఇంకో ఘనత సాధించేసింది
ఏపీలో సోషల్ మీడియా సమిట్.. అవార్డ్స్ అంటూ ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది. యాక్టివ్‌గా ఉన్నందుకంటూ..అనిరుధ్, దీపికా పదుకోనే, దగ్గుబాటి రాణాలకు పురస్కారాలు అందజేసింది. అసలు ఈ ఈవెంట్ ద్వారా మన(ఏపి) టూరిజం ఎలా డెవలప్ అవుతుందో..లేదంటే ఇంకాస్త పెరుగుతుందో..అర్దమైతే ఒట్టు..నిజంగానే పర్యాటకానికీ..సోషల్ మీడియా పాపులారిటీకీ ఏంటి లింక్..సరే మావి మందబుధ్దులే..ఒప్పుకున్నాం..అసలు ఏ ప్రాతిపదికన వీళ్లిద్దరూ జనం నెట్‌లో మెచ్చారో తెలుసుకోవచ్చా..! అదీ వదిలేద్దాం.. ఇంకా నయం సన్నీ లియోన్ ని ఎక్కువమంది లైక్ చేశారనో..ఫాలోఅయ్యారనో అనుకుంటే..ఆమెని కూడా ఏపికి టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా చేసేవాళ్లేమో!
ఎక్కడో బాంబేలో అంటే ఇలాంటి ఫంక్షన్లు అక్కడక్కడా చేస్తుంటారు..కానీ ఏకంగా ఓ రాష్ట్రప్రభుత్వమే ఇలా పురస్కారాలు అందజేయడం విడ్డూరమే! ఇక భజన చేయడమే తారకమంత్రమైన ఓ ఛానల్ ఈ కార్యక్రమానికి సామాజిక సత్కారం అంటూ టైటిల్ కూడా పెట్టుకుని మురిసిపోయింది..అహా...అమరావతి..ఇంకా ఇలాంటి ఎన్ని సిత్రాలు సూడాల్సి వస్తుందో..అనవసరంగా అప్పుడెప్పుడో బీచ్ ఫెస్టివల్ విశాఖలో ఆపేసారు కానీ..వచ్చే ఏడాదిలోఖచ్చితంగా అమరావతిలో పెడతారేమో..!
Comments
Post a Comment