రైల్వేస్టేషన్ ఏం చేసిందయ్యా..! నష్టం వందలకోట్లలో..! సదరు మీడియా నిర్లజ్జ వైఖరి

 


కేంద్రంలో ఉన్న బిజెపి ప్రవేశపెట్టిన అగ్నిపథ్ తమకి ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదంటూ

రక్షణ రంగంలో ఉద్యోగాల కోసం ధరఖాస్తు చేసుకున్నవారు ఆందోళనలు చేస్తున్నారు. ఇంతవరకూ ఓకే, 

కానీ మధ్యలో రైళ్లు, స్టేషన్లు ఏం పాపం చేశాయని వాటిపై దాడికి దిగాలి..? ఒకప్పుడంటే అవి ప్రభుత్వఆస్తులు

వాటిని ధ్వంసం చేస్తే, పైనున్న వాళ్లకి నొప్పి తెలుస్తుందుకునేవాళ్లు..కానీ నేటి పాలకులకు ఈ నష్టాలతో చీమ కుట్టినట్లైనా

ఉండదు


తీరా జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత వచ్చి ఓ  అమెండ్‌మెంటో, ఇంకో తాత్కాలిక వెనకడుగు చర్యలనో

ప్రకటిస్తారు. మరి జరిగిన నష్టం ఎన్ని రోజులకు పూడుతుందో ఏమైనా అర్ధమవుతుందా..? పైగా ఇదేం తాత్కాలిక ఆవేశంతో

చోటు చేసుకున్న సంఘటన కాదు, చక్కగా ప్రణాళిక రచించుకుని మరీ ధ్వంసాలకు పాల్పడుతుంటే, మధ్యలో

సామాన్యులు..ఈ గొడవలతో సంబంధం లేనివాళ్లు బలైపోవాలా..ఇవాళ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకున్న ఉదంతం

చూస్తుంటే, ఈ ఆర్మీ ఉద్యోగార్ధులపై ఆగ్రహమే ఎక్కువ కలుగుతుంది. ఎంతమంది తమ గమ్యస్థానాలకు చేరుకోవడం కోసం

ఈ రైళ్లని వాడుతుంటారో ఈ వ్యక్తులకు తెలుసా..? 


ఏదైనా నష్టం మన ఇంట్లో జరిగితేనే స్పందించాలా..? ఇంతమంది కలిసి గంటల్లో ఇంత విధ్వంసం చేసారు కానీ..మరి పోయిన

ఒక్క ప్రాణాన్ని జీవితాంతం తపస్సు చేసినా వెనక్కి తీసుకురాగలరా..మిట్టవేదాంతం కాదిది..! ఎక్కడో అగ్గి రాజేస్తారు..ఎవరి స్వార్ధం కోసమో

రెచ్చగొడతారు..ఉద్యమాలంటారు..ఆందోళనలంటారు..తీరా సమయానికి ఇంకెవరో వచ్చి జొరబడతారు..సర్వనాశనం చేస్తారు. లేకపోతే ఏంటిది

రైల్వేస్టేషన్లు తగలబడితే ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డు తన విధానం మార్చుకుంటుందా..? అంత చేవ ఉన్నవాళ్లైతే ఆర్మీ కార్యాలయాల జోలికి ఎందుకు

వెళ్లరు..? ఎందుకంటే..అక్కడ కనీసం అనుమానం కలిగినా కాల్చి పారేస్తారు కాబట్టి..ఆర్టీసీ బస్సులన్నా..జనం నడిచే రోడ్లన్నా..రైల్వేస్టేషన్లన్నా కూడా

ఇలాంటోళ్లకి చులకన..ఏం చేసినా మూకలో కలిసిపోతుందనే మందధైర్యం. 


అగ్నిపథ్ -నాలుగేళ్ల వరకే ఆర్మీఉద్యోగాలు ఉంటాయి. ఆ తర్వాత తిరిగి టెస్టులు రాస్తే కానీ మళ్లీ ఉద్యోగాలు ఉండవనేది చెప్తోంది. ఇది మమ్మూటికీ

తప్పుడు విధానమే..దానికి నిరసనలు తెలిపే విధానం ఇదా..ఉత్తరాది రైతులు, అగ్రికల్చరల్ యాక్ట్స్‌కి వ్యతిరేకంగా ఎన్నాళ్లు ధర్నాలు చేయలేదు..బారికేడ్లకి ముళ్లు పెట్టి బాధించినా, వెనక్కి తగ్గారా లేదు కదా..! ఈ మూకదాడి వెనుక కుట్రకోణంపై దర్యాప్తు జరగాల్సిందే. ఇదే సందర్భంగా కొన్ని మీడియా

సంస్థలు అత్యంత నిర్లజ్జగా వ్యవహరిస్తున్న తీరు విషాదం. మేం రిపోర్ట్ చేస్తాం మీరు డిసైడ్ చేస్కోండంటూ.." ఇంకాసేపట్లో విధ్వంసం జరుగుతుంది..ఎందుకంటే..చాలామంది ఉన్నారు..రేపు అక్కడ..ఇక్కడ కూడా ఆందోళనలు జరుగుతాయ్.." అఁటూ విధ్వంసం జరిగితే బావుండనే కోణంలో ప్రత్యక్ష ప్రసారాలు ఇవ్వడం చాలా చాలా ఘోరం. ఎక్కడైనా ఇదిగో ఇన్ని రైళ్లు రద్దయ్యాయ్. ఇంత నష్టం జరిగిందనో..లేదూ, ఇవాళ నడిచే రైళ్లు ఇక్కడ్నుంచి నడుస్తాయ్..ప్రయాణీకులు ఇలా వెళ్లండి..ఇవిగో హెల్ప్ లైన్ నంబర్లు అని వార్తలు ప్రసారం చేసాయంటే సొసైటీకి మేలు చేసినట్లవుతుంది. అంతేకానీ,,ఇవాళ

ఇదే పెద్ద వార్త ఇదే నడవాలి జనం మన ఛానలే చూస్తారని చంకలు గుద్దుకుంటూ బ్రేకింగ్స్ వేయడం ఏంటి..?


Comments