న్యూక్ కాదు..నౌటంకి పాక్..సిగ్గులేని మునీర్
అసిఫ్ మునీర్ కామెంట్లని ఖండించిన భారత విదేశాంగ శాఖ
దెబ్బకి చిన్నమెదడు చితికిపోయిందా..ట్రంప్ అండతో పూర్తిగా పోయిందా?
పిచ్చవాగుడు వాగుతోన్న పాక్ ఆర్మీ చీఫ్ మునీర్
పహల్గాంలో దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టింది భారత్..ఈ దెబ్బతో పాకిస్తాన్ మరో
వందేళ్లు పైకి లేవకూడదన్నరీతిలో చావుదెబ్బ కొట్టింది. మనపై దాడికి వచ్చిన ఆరు విమానాలను నేలకూల్చిందిఐనా సరే..లేనిపోని బీరాలు పలుకుతోంది పాక్..ఆ దేశపు ఆర్మీ చీఫ్ బెదిరింపులకు..అంతూ పొంతూ లేకుండా పోతోంది తాజాగా అమెరికాలో ఓ డిన్నర్ తీసుకుంటా..తన నోటికి అద్దూ అదుపూ లేకుండా రెచ్చిపోయాడు..సింధునదిపై భారత్
కట్టే డ్యామ్‌ని పది అణుబాంబులతో ధ్వంసం చేస్తామంటూ బీరాలు పలికాడు..ఐతే ఈ బెదిరింపులే పాక్ అసలు నైజాన్ని బైటపెట్టాయంది భారతవిదేశాంగశాఖ..మునీర్ మాటలకు ఎవరూ బెదిరిపోరని తేల్చేసింది.
సుంకాల రాయుడు ట్రంప్ తనకి అండగా ఉంటాడనుకున్నాడో ఏమో కానీ..అసిఫ్ మునీర్ అమెరికాలో ఇలాటి కామెంట్లు చేసాడు.యూఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ మైఖేల్ కురిల్లా రిటైర్మెంట్ ఈవెంట్లో మాట్లాడుతూ..అసలు తమకి సగం ప్రపంచం నాశనంచేసే సత్తా ఉందంటూ జబ్బులు చరుచుకున్నాడు.
అసిఫ్ మునీర్ మాటలు కనీసం ఆ దేశంలోనివారైనా నమ్ముతారో లేదో కానీ..తన అవసరం కోసం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇలాంటివారిని బాగా ఎంకరేజ్ చేస్తున్నట్లు కన్పిస్తోంది. భారత్‌పై సుంకం వేసి పాకిస్తాన్‌ని వదిలిపెట్టగానే..ఇక పాక్‌కి కొండంత అండ లభించినట్లు అంచనా వేసుకుంటున్నట్లు కన్పిస్తోంది ఆ పిచ్చి ధైర్యంతోనే ఇలాంటి వాగుడు తప్ప..నిజానికి పాకిస్థాన్ బతుకు ఏంటనేది ఈ మూడునెలల్లో భారత్ ప్రపంచం ముందు ఎన్నోసార్లు నడిరోడ్డుపై పరిచింది. మూడు నెలలకి ఓసారి అప్పు కోసం ప్రపంచబ్యాంకును యాచించే పాకిస్థాన్..సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటే..అమెరికాకి అది ఇంపుగా ఉండొచ్చేమో కానీ..వాస్తవం
తెలిసినవాళ్లెవరూ దీన్నసలు పట్టించుకోరు..అందుకే మన విదేశాంగశాఖ కూడా..పాక్ ఆర్మీ న్యూక్ బ్లాక్ మెయిల్‌ని నౌటంకిగా కొట్టిపారేసింది. అసలు పాకిస్థాన్ సైన్యం టెర్రరిస్టులతో కలిసిపోయిందనడానికి ఇంతకంటే రుజువు ఏం కావాలని భారత విదేశాంగ శాఖ స్పందించింది
లాగిపెట్టి కొడితే నిలబడటానికి బైటికి వచ్చి మాట్లాడటానికి నెలరోజులు పట్టిన పాకిస్థాన్..న్యూక్లియర్ బాంబులేస్తుంటే భారత్ చూస్తూ కూర్చుంటుందా..కిరానా హిల్స్‌పై జరిగింది ఏ తరహా దాడో..ఇంతవరకూ పాకిస్థాన్ ఓపెన్‌గా చెప్పుకోలేకపోయింది
ఈ తరహా మాటలు చూస్తుంటే..పాకిస్థాన్‌కి ఖచ్చితంగా మరో రౌండ్ వాయింపుడు పడాల్సిందే అంటే తప్పేం లేదు
Comments
Post a Comment