అసలు ఛార్జ్ షీటే వేయలేదా


అంతన్నాడింతన్నాడే..గంగరాజు..అనే ఒక పాట ఉంది. అలానే తయారైంది డ్రగ్స్ రాకెట్ కేసు. స్కూలు పిల్లలకు కూడా డ్రగ్స్ సప్లై చేస్తున్నారనే సమాచారంతొ బయలుదేరిన ఈ కథ సినిమానటుల ఎంట్రీతొ బాగా హైప్ వచ్చింది..అప్పుడే ఇది బడాబాబుల పిల్లలు..వాళ్ల పేర్లు, స్కూళ్ల యాజమాన్యాలపై ఫొకస్ లేకుండా ఉండటానికే ఇలా చేస్తున్నారని కూడా కామెంట్లు వచ్చాయ్..ఐనా మీడియాకి అదంతా అవసరం లేదు కదా..పూరీ జగన్నాధ్, రవితేజ, ముమైత్ ఖాన్, ఛార్మి లాంటి గ్లామర్ ఫిగర్లను పొలీసులు ఇఁటరాగేట్ చేస్తుంటే..వాటిపై లైవ్ లు ఇవ్వడమే సమ్మగా ఉంటుంది కదా..
అందుకే వాళ్లెలా వంట్లొనుంచి డ్రగ్స్ బైటికి పంపించుకున్నారు..వాళ్లెక్కడెక్కడ తిరిగారు ఏ డాక్టర్ ని కలిశారు లాంటి స్టొరీలు వండి వార్చుకుని సంతొష పడ్డారు..ఎవడు అకున్ సభర్వాల్ ముందుకు వచ్చినా వాడికి కెల్విన్ ‌తొ లింకులుున్నాయని..అవి బైటపెట్టారని చెప్పుకుని సంతొషపడ్డారు..తీరా చూస్తే..ఇవాళ కెల్విన్‌పైన చార్జ్ షీటే వేయకపొవడంతొ నాంపల్లి కొర్టు రిలీజ్ చేసిందట..ఇఁతకన్నా ఘొరమైన వైఫల్యం ఉంటుందా..అసలు ఈ సిస్టమ్‌లొ ఎవరు వేలెడితే ఇలాంటి టర్నింగ్స్ తీసుకున్నాయొ ఈ సాయంత్రానికి రేవంత్ రెడ్డి వచ్చి ప్రెస్‌మీట్స్ పెడతాడు చూడండి..పైగా రిలీజైన కెల్విన్ సాధారణమైన జీవితం గడుపుతాడట..అంటే ఇదివరకటిలానే డ్రగ్స్ పెడలింగ్ చేస్తాడనా..లేక వాటికి బై చెప్పేసి పబ్బుల్లొ గేటు కీపర్‌గా పనిచేస్తాడనా..అసలు జనవరి 1కి మందు మాకూతొ పాటు..గంజాయి దమ్ము లేకపొతే కిక్కులేదని విడిపించుకున్నారంటూ కూడా సినిమాజనంపై కామెంట్లు వస్తున్నాయ్ మరి..బాబూ...ఆకునూ...వింటున్నావా ఇది

Comments