అమృత ..జయలలిత కూతుర్నంటూ సుప్రీంకోర్టుకి పిటీషన్ వేయడం..కోర్టు అసలు హైకోర్టులో కాకుండా ఇక్కడకెందుకు వచ్చారని మందలించడం తెలిసిందే కదా..! ఏదైనా మనకి సెంటిమెంట్లు ఎక్కువ కాబట్టి..అందరికీ తెలిసిన వ్యక్తులకు వారసులు ఉండాలని రావాలని కోరుకుంటాం..సినిమావాళ్ల విషయంలో ఇంకా ఆసక్తి ఎక్కువ మనకి.అందుకే కథలో ట్విస్టులు ఉఁటేనే నచ్చుతుంది..అందుకే అమృతని చూసినవాళ్లంతా అచ్చంగా జయలలితలానే ఉందే అనుకోవడం సహజం..పైగా డిఎన్ఏ టెస్టుకి కూడా రెడీ అంటుందాయె
ఈ వీడియో చూడండి
అమృత చెప్పినదాని ప్రకారం ఆమె తండ్రి కూడా తెలిసిన వ్యక్తే.ఓరకంగా ఇప్పటికీ ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు..యాక్టివ్‌గా కూడాఉన్నారు..శోభన్ బాబు మనవడి పెళ్లికికూడా ఆహ్వానాలు అందుకుని మరీ కుటుంబంతో దగ్గరగా మెలిగేంత అభిమానగణం ఇప్పటికీ ఉన్నారాయనకు. వీళ్లిద్దరికీ తాను పుట్టానని..1990ల్లో జయలలిత కుటుంబానికి మళ్లీ దగ్గరైతే బాగా ఆదరించారని కూడా చెప్తోంది..
అది బానే ఉంది..ఇప్పుడు కొత్తగా గీత అనే ఆవిడ( జయలలిత స్నేహితురాలిగా ఆమే చెప్పుకుంటోంది...మీడియా కూడాఅలానే ప్రచారం చేస్తోేంది) శోభన్ బాబు 1999 ప్రాంతంలో తమకో కూతురున్నట్లు చెప్పినట్లు అఁటోందామె.. ఇది నిజమో కాదో చెప్పడానికి అటు శోభన్ లేడు..ఇటు జయలలిత లేరు..ఐనా కథలో బోలెడంత సస్పెన్స్ఉంది..ఇక నిజంగా డిఎన్ఏ టెస్టులకు ఓకే అయితే..ఏం జరుగుతోంది
ఒకటి జయ ఆస్తులకు వారసులు...రెండోది పార్టీకి వారసులు..ఇవి రెండూ అయితే ఒకఎత్తు..అసలు ట్విస్ట్ వచ్చినావిడ అమృత..శోభన్ బాబు ఆస్తుల్లో వాటా అడిగితే కరుణాశేష్ ఊరుకుంటాడా...అసలీ పరిణామాలపై ఎప్పుడూ వారి కుటుంబసభ్యులను మీడియా అడిగిందీ లేదు..వాళ్లు చెప్పిందీ లేదు...ఐతే ఒకటి చనిపోయినవారి ప్రవేట ్ జీవితాలపై ఇప్పుడు సెర్చ్ ఆపరేషన్ బాధ కలిగించేదే..కానీ తప్పదు కదా...
ఐతే అంత మాత్రాన ఇప్పుడు వచ్చిన అమృత నిజంగానే జయలలిత కూతురా..లేక ఇమేజ్ డ్యామేజ్ చేయించేందుకు ప్రత్యర్ధి పార్టీలు పన్నిన కుట్రా అనేది తెలీదు..ఎలాగైతేనేం తమిళ మీడియాతో పాటు మన మీడియాకి కూడా ఓ మసాలా వార్త దొరికింది..చాలు..
Comments
Post a Comment