అమ్మయ్య జగన్‌కి ఒక టెన్షన్ వదిలింది..బై ఎలక్షన్స్‌కి రెడీ


రాజీనామాలు అసలు ఆమొదం పొందవు  అనేవారికి చెంపపెట్టులా వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపిల రిజిగ్నేషన్స్‌ని సుమిత్రా మహాజన్ ఆమొదించేశారు..ఇక ఆ విమర్శలు చేసేవారికి తర్వాతి పదం..డ్రామా...అవును బై ఎలక్షన్స్ రాకపొతే ఇదంతా డ్రామా అంటారు..అంటే ఇక ఈ ఐదుగురు ఎంపిలు ఎలక్షన్ కమిషన్ చుట్టూ తిరగాలనేది వీళ్ల మాటల సారాంశం..ఐనా..ఇక్కడే జగన్ పార్టికి మరొ ప్లస్ పాయింట్ యాడ్ అయింది. ఎందుకంటే..మా ఎంపిల రాజీనామాలు ఆమొదింపజేసుకొలేరు అని అంటున్నారు కదా..మరి మీ జంపింగ్ జిలానీల సంగతేంటి..మీ పీకరే కదా అక్కడుంది..మీరెందుకు ఏపిలొ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమొదించరు..అని జగన్ పార్టీ ప్రతినిధులు ఇప్పటికే కనీసం వందసార్లు సవాళ్లు విసిరారు. మరి వాళ్ల లాజిక్ నిజమేగా..ఇప్పుడిక అంబటి, వాసిరెడ్డి పద్మ, విజయసాయిరెడ్డి, రొజా, బొత్స ఇదే పాయింట్ పట్టుకుని టిడిపిపైన రెచ్చిపొడానికి సిధ్దం..మరి టిడిపి లీడర్లు ఏమని సమర్ధించుకుంటారొ చూడాలి..!

అసలు ఎన్నికలు ఏడాదిలొపు ఉఁటే బై ఎలక్షన్స్ జరగవని..రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారుట..సదరు బాసుకూచి పత్రికలు ఇప్పటికే హొరెత్తించాయ్..అంటే ఒకవేళ ఎలక్షన్ కమిషన్ పెట్టినా కూడా వీళ్లు జరగనివ్వరేమొ. ఎందుకంటే
50ఏళ్లకిపైన చరిత్ర ఉన్న రైల్వే బడ్జెట్ మాయం కాలేదా...ప్లానింగ్ కమిషన్ ని రద్దు చేయలేదా..ముఫ్పై ఏళ్లుగా చలామణీలొ ఉన్న నొట్లు రద్దు కాలేదా..ఎఁదుకు ప్రతిదాన్ని రాజ్యాంగంతొ ముడిపెట్టి ఏదొ పెద్ద మేధావితనం ప్రదర్శిస్తారు..పైగా ఎన్నికల నియమావళి అంటూ ఒక నేపధ్యం రంగరిస్తారు.
ఇప్పటికే వైఎస్ జగన్ ఈ ఐదుగురు ఎంపిల నియొజకవర్గాల్లొ పాదయాత్ర పూర్తైంది. అంటే ఒక రకంగా తన ఎంపిల తరపున ప్రచారం పూర్తి చేసినట్లే..ఎలక్షన్ కమిషన్ కనుక ఎన్నికలకు ఒకే అన్నదంటే..టిడిపి తలపెట్టిన ఆర్నెల్ల నిరుద్యొగ భృతి అనబడు దేవతావస్త్రాలు ఇక గంగలొ కలిసినట్లే 35 నియొజకవర్గాలలొ ఈ కొడ్ అమలులొకి వస్తుంది..పైగా ఎన్నికలు వస్తున్నాయని ఈ స్కీమ్ తెచ్చావా బాబూ అంటూ ఎకసెక్కాలూ మొదలవుతాయి. అలా లొక్ సభ స్పీకర్ ప్రస్తుతానికి జగన్‌కి రిలీఫ్ ఇచ్చినట్లే..ఇదిగొ మేం చేశాం హొదా కొసం రాజీనామా..యాక్సెప్ట్ కూడా చేశారు..మరి నువ్వేం చేశావ్ బాబూ...ఏం అక్కా...ఏం అన్నా...ఏం చెల్లీ....ఏం అవ్వా...ఏం తాతా...అఁటూ  రేపట్నుంచి పాదయాత్రలొ  అడుగుతూ.......నే......ఉంటాడు..

Comments