నిన్ను చూసి ఎవరైనా ఎందుకు భయపడాలి పవన్ ?



నేనంటే భయంతోనే అంతా నాపై దాడులు చేస్తున్నారని పవన్ కల్యాణ్ పాపం రెండో రోజు కూడా తన అక్కసు వెళ్లగక్కారు. నిజంగా పవన్ కల్యాణ్ మాటలను తరచి చూస్తే..ఆయన మొదటిసారి ఎన్నికల బరిలో ఉంటే..వామ్మో..అన్న వచ్చాడు..ఇక ఓట్లు కొల్లగొడతాడు అని భయపడాలి. ఆయన తన అన్నయ్య తరపున ప్రజారాజ్యానికి ప్రచారం చేశాడు. ఆయన పోటీ చేయలేదు కానీ..అన్న చిరంజీవి పోటీ చేసి రెండు చోట్లలో ఒక చోట ఓడిపోయాడు. అప్పుడూ ఆయన పార్టీకి దక్కింది 18 సీట్లు. పోనీ ఆ పార్టీ నాది కాదు అని ఒక్క మాట అంటే ఇలాంటి విమర్శలు భవిష్యత్తులో ఎవరూ చేయరు..తిరిగి 2014లో ీసీన్‌లోకి వచ్చి దొంగదారిలో నాకు పోటీ చేసే సత్తా ఉంది చేయను..జిహెచ్ఎంసి ఎన్నికలలో పోటీ చేసే సత్తా ఉంది చేయను..మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే సత్తా ఉంది కానీ చేయను అంటూనే పోయారు. అప్పుడు బిజెపి, టిడిపి, జనసేనకి కలిసి వచ్చిన సీట్లు ఓట్లు ఎన్నో గుర్తున్నాయి కదా

ఐనా ఇప్పుడు 2019లో పోటీ చేస్తా..చేస్తా అంటున్నారు..నిజంగా మీకు అన్ని చోట్లా పోటీ చేసేందుకు అభ్యర్ధులు దొరుకుతారా..సరే దొరికారు అనుకుందాం..ముందు మీరేం చెప్పారు కనీసం ఎన్నికలకు 6 నెలలకు ముందే కాండిడేట్లను ప్రకటిస్తాం అన్నారు కదా..ఇప్పుడు ఇక ఉన్నది 9 నెలల సమయమే మిత్రమా..కమాన్ జనసేన సత్తా చాటండి..మీ అభ్యర్ధులను ప్రకటించండి..

మీ ఓట్లు..సీట్ల సంగతి తెలిసి కూడా మిమ్మల్ని చూసి జగన్ భయపడే సీన్ ఉందా..జగన్ మోహన్ రెడ్డి సొంతంగా పార్టీ పెట్టుకుని ఏడేళ్లైంది..ఓటమి చెందిన తర్వాత సింగిల్‌గా పార్టీని నడుపుకుంటూ ఐదేళ్లనుంచి రోడ్లపైనే ఉన్నాడు..ఒక్క కామెంట్ చేస్తేనే తట్టుకోలేక మీటింగులు పెట్టుకుని..ఫ్యాన్స్‌కి ఇన్ డైరక్ట్‌గా సిగ్నల్స్ పంపిస్తున్న మీకు జనం మద్దతు ఉందనుకుంటున్నారా...కత్తి మహేష్‌పై ఉసిగొల్పినట్లు ఉసిగొల్పితే ఊరుకోవడానికి వైఎస్ జగన్ వెనుక ఎవరూ లేరనుకుంటే ఎలా..అదిగో..అప్పుడు ఛీరెడ్డి గొంతు విప్పింది..ఏదో బూతులు లంకించుకుంటుంది..పాపం ముందు మీరు ఆమెకి సమాధానం చెప్పుకోండి..ఆమెకి పబ్లిసిటీ కోసం యావ కదా..ఈ సందర్భాన్ని బాగానే వాడుకుంటుంది లే

Comments