మేడమ్ టుస్సాడ్స్‌లో సూపర్ స్టార్ మహేష్ విగ్రహం ఇదే


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహం ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో పెట్టబోతున్న సంగతి తెలిసిందే కదా. ఏప్రిల్ లో ఇందుకు సంబంధించిన కొలతలు తీసుకువెళ్లిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఓ విగ్రహం తయారవ్వాలంటే కనీసం 3 నెలలు పడుతుందట..ఐతే ఇప్పటికే మహేష్ బాబు
తలకి సంబంధించిన భాగం పూర్తైంది..ఆ ఫోటోలు ఇప్పుడు లీకయ్యాయ్. అది చూసిన ప్రిన్స్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

 అచ్చంగా మహేష్ ఎలా ఉంటాడో అలానే ఉన్నాడే అంటూ ఖుషీగా ఆ పోటోలను షేర్ చేస్తున్నారు. తల భాగం వరకు తయారైన మహేష్ విగ్రహాన్ని మనం చూపిస్తున్న ఫోటోలో చూడొచ్చు. ఈ విగ్రహాన్ని ఇవాన్ రీస్ అనే ప్రఖ్యాత వ్యాక్స్ ఆర్టిస్ట్ తయారు చేస్తున్నాడు. వీలైనంత తొందరగా  మహేష్ బాబు పూర్తి విగ్రహం రెడీ అవుతుందట. ఈ విషయమే మహేష్ బాబు కూడా నిర్ధారిస్తూ మేడం టుస్సాడ్ టీమ్‌కి కృతజ్ఞతలు చెప్పాడు. భరత్ అనే నేనుతో బ్లాక్ బస్టర్ కొట్టిన మహేష్ వచ్చే పుట్టిన రోజు ఆగస్ట్ 9..అప్పటికల్లా తన సిల్వర్ జూబ్లీ నంబర్ మూవీ ఫస్ట్ లుక్ తెచ్చే తొందర్లో ఉన్నాడు. పైడిపల్లి వంశీ దర్శకత్వం వహిస్తున్న  ఈ సినిమాకి ప్రొడ్యూసర్లుగా దిల్ రాజు, అశ్వనీదత్‌లు వ్యవహరిస్తున్నారు..ఇందులో మహేష్ బాబు లుక్ డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు తాజాగా బైటికి వచ్చిన మేడమ్ టుస్సాడ్స్ లుక్ కూడా అదిరిపోవడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీగా ఉన్నారు

Comments