ఒక్క ఓటుతో వాజ్‌పేయ్ ప్రభుత్వం ఎలా పడిపోయింది?ఎవరిదా ఒక్క ఓటు? ఓటేసే హక్కు ఉన్నా వాడుకోనిది ఎవరు


ఒక్క ఓటు తేడాతో కేంద్రప్రభుత్వం పడిపోయిన ఘటన గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా. దివంగత నేత వాజ్‌పేయ్ ఆధ్వర్యంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం 1996లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో 161 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్‌కు 140 సీట్లు దక్కాయి. లాలూ ప్రసాద్ నేతృత్వంలోని జేడీయూకు 46 సీట్లు వచ్చాయి. ఈ మూడే అతి పెద్ద పార్టీలుగా ఆ ఎన్నికలలో నిలవగా..సింగిల్ లార్జెస్ట్  పార్టీ అయిన బిజెపికి గత 1991 నాటి ఎన్నికల కంటే 41 సీట్లు ఎక్కువ రాగా..కాంగ్రెస్ 104 సీట్లు కోల్పోయింది. దీంతో 8 సీట్ల సమతా పార్టీ, 15 సీట్లున్న శివసేన, 3 సీట్లు గెలిచిన హర్యానా వికాస్‌ అండతో బిజెపి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించింది. అందుకు నేషనల్ ఫ్రంట్‌లో మద్దతు ఇచ్చింది. ఇందులో టిడిపికి 16 సీట్లు, సమాజ్ వాదీకి 17సీట్లు, జనతాదళ్‌కి 46 సీట్లు ఉన్నాయ్. అలా ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మద్దతు కూడగట్టడంతో అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. ఐతే 13 రోజుల తర్వాత బలనిరూపణ చేయలేక చేతులెత్తేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో దేవేగౌడ ప్రధానిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఇచ్చినన్నాళ్లు ఆయనకి మద్దతిచ్చింది. తర్వాత మద్దతు వెనక్కి తీసుకుంటాననడంతో ఐకే గుజ్రాల్ ప్రధాని అయ్యారు.

ఈసారి గడ్డి కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ గుజ్రాల్ కి సపోర్ట్ వెనక్కి తీసుకోవడంతో 1998లో మధ్యంతరం వచ్చింది. ఈసారి బిజెపికి దక్కింది 182 సీట్లు, కాంగ్రెస్ కి 141 సీట్లు వచ్చాయ్. మళ్లీ అదే సీన్ రిపీటైంది. అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రధానమంత్రి అయ్యారు.

 ఐతే ఈ దఫానేఒక్క ఓటు తేడాతో అయన ప్రభుత్వం పడిపోయిందనే కామెంట్ ఎక్కువ వింటూ వచ్చాం. అదెలా జరిగిందో ఇప్పుడు చూద్దాం టిడిపి 12 సీట్లు, అన్నాడిఎంకే  18 సీట్లు, సమతా పార్టీ 12 , శివసేన 6 సీట్లతో మద్దతు ఇవ్వగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఎన్డీఏ. ఐతే 1999 మే నెలలో వాజ్‌పేయీ  అన్నాడిఎంకే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. ఏప్రిల్ 17 1999న ఎన్డీఏ ప్రభుత్వం  బలం నిరూపించుకోవాల్సి వచ్చింది.
ఆ రోజున ఏం జరిగిందో చూస్తే ఉదయం 10గంటల 45 నిమిషాలు అవుతోంది..ఎంపిలంతా తమ తమ సీట్లలో కూర్చుంటున్నారు. వాజ్ పేయికి ఉందంటోన్న మంచి పేరుతో సులభంగా మెజార్టీ సాధించగలరని ధీమాగా ఉన్నారు బిజెపి నేతలు. దానికి తోడు లెక్క కూడా సరిపోతుంది అనుకున్నారు. స్పీకర్ గంటి మమ్మడివరం బాలయోగి తన స్థానంలో కూర్చోగానే సభలో ఎంపిల మాటలు ఎక్కువ అవడంతో సభని ఆర్డర్‌లో పెట్టాల్సి వచ్చిందట. ముందుగా బిఎస్పీ లీడర్ మాయావతి మాట్లాడటానికి అనుమతి ఇవ్వగా ఆమె ఎన్టీఏకి వ్యతిరేకంగా ఓటేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే మిగిలిన కొంతమంది ఆ పార్టీ ఎంపిలు కూడా విశ్వాసతీర్మానానికి వ్యతిరేకంగా ప్రసంగించారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అభిమతానికి వ్యతిరేకంగా సైఫుద్దీన్ సోజ్ కూడా ఎన్డీఏకి వ్యతిరేకంగా ఓటేస్తున్నట్లు చెప్పారు. దీంతో అధికారపక్షంలో కలకలం బైల్దేరింది.

 ఒరిస్సా ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగ్ కూడా ఎన్డీఏకి వ్యతిరేకంగా ఓటేశారు..ఈ  ఓటే ఎన్డీఏ రెండో దఫా ప్రభుత్వాన్ని కూల్చేసింది.ఇక్కడే ఓ నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. స్పీకర్ స్థానంలోని పిఎ సంగ్మా గిరిధర్ గొమాంగ్‌కి ఓ సూచన చేసారు. మీరు ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.  ఇక్కడ ఎంపిగా రాజీనామా చేయలేదు..ఇప్పుడు ఓటు వేస్తారా లేదా అనేది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను అని చెప్పారట. కానీ ఆయన మాత్రం అది విన్పించుకోకుండా వాజ్‌పేయికి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో అధికారపక్షం బలం 272 అయింది. సాధారణంగా ఈ నంబర్ మెజార్టీనే కావచ్చు. కానీ అటు ప్రతిపక్షం ఓటు మాత్రం 273గా తేలింది. దీంతో విశ్వాసతీర్మానం ఓడిపోయింది వాజ్ పేయి పదవీచ్యుతుడు కావాల్సి వచ్చింది. సభలో ఈ నంబర్లు ప్రదర్శించబడగానే అందరిలో ఒక్కసారిగా షాక్ తగిలిన ఫీలింగ్ కన్పించిందట.



వాజ్‌పేయ్ స్వయంగా ఆ నంబర్లను చూసిన తర్వాత చేయి తలపై ఓ సెకన్ పెట్టుకుని..తర్వాత లేచి సభ అంతటికీ శాల్యూట్ చేస్తున్నట్లుగా సంజ్ఞ చేసి వెళ్లిపోయారట. ఈ పరిస్థితిని తట్టుకోలేక విజయరాజె సింథియా ప్రధానమంత్రి కార్యాలయంలో వాజ్‌పేయి ఎదుట తీవ్రఆవేదనతో మాట్లాడుతూ కుప్పకూలరాట. వాజ్‌పేయ్ ఆమెని
ఎంతగా సముదాయించకపోగా, తానూ బరస్ట్ అయ్యారట.   ఆ సమయంలో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తారని పేరున్న ప్రమోద్ మహాజన్ తీవ్రంగా ప్రతి ఒక్కరినీ ఎన్డీఏకి అనుకూలంగా చేసేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదట. ఇలా ప్రభుత్వం పతనానికి వ్యూహం కూడా 1999 మార్చిలోనే బీజం పడిందట.



మార్చి 29న  జరిగిన ఓ టీ పార్టీలో సోనియాగాంధీ, జయలలిత కలుసుకున్నారట..అక్కడే వీరిద్దరూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని పడేసేందుకు వ్యూహం రచించగా, దాన్నిజయలలిత ఏప్రిల్‌ 14నాటికి అమలు చేసేశారు. రాష్ట్రపతి కేఆర్ నారాయణన్‌ని కలిసి తాను ఎన్డీఏ నుంచి బైటికి వచ్చానని..సపోర్ట్ వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారట. ఐతే వాజ్‌పేయ్‌ మాత్రం తన ప్రభుత్వం సులభంగా విశ్వాసపరీక్షలో నెగ్గగలదని అనుకున్నారు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత బిఎస్పీ మాయావతి తన ఐదుగురు సభ్యుల మద్దతు వాజ్‌పేయ్‌కి ఇస్తామని చెప్పారట. కానీ సభలో మాత్రం రివర్సయ్యారు. దీంతో పాటు గిరిధర్ గొమాంగ్ నిర్వాకం కూడా బిజెపి కొంప ముంచింది..ఇంత చేసిన గిరిధర్ 2015లో బిజెపిలో చేరడం రాజకీయాల్లోని చిత్రాలకు నిదర్శనం. ఐతే ఇక్కడే ఇంకో విశేషం కూడా ఉంది..నిర్ణయాత్మకంగా మారి రెండుపక్షాల ఓట్లు సమమైన పక్షంలో జిఎంసి బాలయోగి తన విశేష అధికారాలను వాడి తన ఓటు బిజెపికి వేసి ఉండేవారని అంటారు. కానీ అప్పటికే ఎన్డీఏ బలం ఓ ఓటు తగ్గిన సమయంలో బాలయోగి ఆ చొరవ తీసుకోలేకపోయారు. ఐతే  తిరిగి ఎన్నికలకు  1999 అక్టోబర్‌లో ఎన్నికలు జరగగా..బిజెపి బలం ఏ మాత్రం పెరగకపోగా 180సీట్లతో సరిపెట్టుకుంది. కానీ మిత్రుల ఘనవిజయంతో సాఫిగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అది ఇంకో చరిత్ర. బేరసారాలు చేయకపోవడం వల్లనే వాజ్‌పేయి ఆ ఒక్క ఓటు తేడాతో పదవి కోల్పోవాల్సి వచ్చిందంటారు కానీ..ఆ ఇమేజ్‌తోనే ఆయన తిరిగి మరోసారి ప్రధానమంత్రి కాగలిగారన్నది గుర్తించాలి.

Comments

  1. ఈ వ్యాసం యధాతథంగా TV5 వారి profit your trade వెబ్ సైట్లో ఉంది. వాళ్ళు కాపి కొట్టారా? మీరు కాపి కొట్టారా?

    ReplyDelete

Post a Comment