వాచిపోయింది..తెలంగాణ దెబ్బకి...!


అలాగిలాగ కొట్టలేదు..ఇహ ఎవడి మద్దతూ లేకుండా..ఎవడిని లాక్కోకుండానే సిఎం కేసీఆర్...మరోసారి సారు అయిపోయాడు..ముందుగా నాబోటి వాళ్లకి ఇదో గుణపాఠం..పేపర్ మీద లెక్కలేసుకుని లేసులు కట్టకుండానే ఊరంతా తిరిగి వచ్చేసినట్లు బిల్డప్ ఇచ్చి..అది జరిగితే కేసీఆర్ కి చుక్కలే లాంటి హెడ్డింగులు పెట్టుకునే(నేనే)వాళ్లకి
అలా కాదు బిడ్డా...ఇలా చూడాలి ఎన్నికలను అని మార్గం చూపిన ఫలితాలు ఇవి
సెంటిమెంట్ ముందు ఏదీ నిలబడదని చెప్పిన ఫలితాలు ఇవి...తెలంగాణ నేను నాటిన మొక్క పుష్పించబోతోంది..ఫలాలు రాబోతున్నాయ్..ఈనగాచి నక్కలపాలు చేయొద్దు..ఆగమాగం కావద్దు..గాలి గత్తర కావద్దు..కాళేస్వరం కావాలంటే  టిఆర్ఎస్ కి ఓటేయండంటూ ప్రాథేయపడినందుకు..తెలంగాణ జనం కేసీఆర్ కి కిరీటం పెట్టారు..
ఇక ఇప్పుడు పాలనపై దృష్టి పెట్టాల్సిందే...ప్రతిదానికీ కాంగ్రెస్, టిడిపి అడ్డం పడుతున్నారనే వాదనలు ఇకపై జనం నమ్మరు. ఎందుకంటే..వాళ్లని నమ్మకనే కదా మనకి ఓట్లేశారు..ఇక ఈ  ఐదేళ్లలో కొత్తవి కాదు..పాత పథకాలను అమలు చేస్తూ పోయినా చాలు..మంచిగా ఉంటుంది..జనానికి ప్రభుత్వానికి..మరది చేస్తారా

తప్పదు..గెలిపించిన జనానికి ఏదో చేయాలనే తపన ఖచ్చితంగా కన్పిస్తుంది..కన్పించాలి కూడా..ఐతే నేను చేసిందే మంచి అనుకోవడమే పొరపాటు..అది ఏ ప్రభుత్వాధినేతైనా గుర్తించాలి..లేకపోతే..

Comments