ఎహ రాహుల్ గాంధీ ఉన్నాడు మనకేం ఢోకాలేదు..యోగీ ఆదిత్యనాధ్ భలే ధీమా


కాంగ్రెస్‌లో రాహుల్ గాంధీ..టిడిపిలో చినబాబు వీళ్లపై వచ్చినన్ని సెటైర్లు ఇంకెవరిపైనా వచ్చి ఉండవు..ఏపీలో జగన్ మోహన్ రెడ్డి పై ప్రత్యర్దులు చేసిన విమర్శలకైతే ప్రపంచరికార్డు ఇవ్వాల్సిందే..అన్నిటిని తట్టుకుని ఇవాళ జగన్ అంటే జగజ్జేతగా నిలవగలిగాడు..కానీ పైన చెప్పిన రెండు శాల్తీలు...పలాయనవాదంతో పాటు..ట్విట్టర్ సింహాలుగా పేరు తెచ్చుకున్నాయ్..కానీ రాహుల్ గాంధీపై పడ్డ పప్పు ముద్దని మాత్రం విజయవంతంగా కష్టపడి తొలగించుకున్నాడనుకోండి..

కానీ ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో మరోసారి బిజెపి మైండ్ గేమ్ ఆడుతుండేసరికి..మళ్లీ ఆయనపై ఐరన్ లెగ్ ముద్ర వేయడం ప్రారంభమైంది..చత్తీస్ గఢ్ రాజస్తాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో విజయాలను అందించడంలో సక్సెస్ అయిన రాహుల్ పార్లమెంట్ ఎన్నికలలో మాత్రం చతికిలబడాల్సి వచ్చింది..కానీ అపజయాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం కూడా ప్రత్యర్ధులు అవకాశంగా తీసుకోవడమే దారుణం..ఓ రకంగా ఇందుకు రాహుల్ కూడా కారణమేమో..ఎందుకంటే ఓడిపోయినా..నిస్సిగ్గుగా తన తప్పేం లేదన్నట్లుగా వ్యవహరించే లీడర్లున్న కాలంలో ఇలా బాధ్యత తీసుకోవడం కూడా బాధ్యతలనుంచి పారిపోవడమే అంటారు

యూపీ సిఎం ఆదిత్యనాధ్ ముంబైలో దిగుతూనే అడిగాడట..ఎవరెవరు వస్తున్నారు వచ్చారు ప్రచారానికి  అని..వెంటనే వాళ్లేమో రాహుల్ గాంధీ వచ్చారనన్నారట..దాంతో ఆయనగారికి వందశాతం బిజెపి గెలుపు ఖాయమని..కాంగ్రెస్ ఓటమి ఖరారైందని అనుకున్నాడట..అేదే విషయం అక్కడ కూడా చెప్పుకొచ్చాడు..ఈ మైండ్ గేమ్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో అక్టోబర్ 24 తేలిపోతుందిలెండి..

Comments