2నెలల్లో 7 లక్షల కేసులా, వామ్మో.మేతో తగ్గిపోతుంది..జూన్‌లో వైరస్‌కి సీన్ సితారే కబుర్లన్నీ ఎటుపోయాయ్
గుండె చిక్కబట్టుకోండి..జులై నెలనాటికి దేశంలో కరోనా పేషెంట్ల సంఖ్య 7లక్షల వరకూ అవుతుందట..అంటే .లాక్‌డౌన్ మే నెలాఖరు వరకూ పొడిగించినా..వైరస్ ఉధృతి తగ్గుతుందనే గ్యారంటీ లేదు. పైగా రానున్న రెండు నెలల్లో ఇంకా పేషెంట్ల సంఖ్య భారీగా పెరగబోతుందనే ఓ అంతర్గత నివేదిక కేంద్రానికి వచ్చిందట..ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు..అవసరమైన చర్యలు తీసుకునేందుకు కేంద్రం ప్రణాళిక రచిస్తుందని తెలుస్తోంది అంటే..ఏం లేదు..ట్రీట్‌మెంట్‌కి రెడీ చేసుకుంటుందట
దేశవ్యాప్తంగా రానున్న రెండు నెలల్లో కేంద్రం కోటిమందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని సంకల్పించింది.. మరిప్పటిదాకా ఏం గాడిదలు కాసిందని అడగకండి..అదంతే...ఈ టెస్టింగ్ కోసమే 20 నగరాల్లో స్పెషల్ ప్రోటోకాల్
మార్గదర్శకాలను తయారు చేస్తోంది..జూన్, జులై నెలల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని..అందుకోసం స్టాక్‌పైల్ పెట్టుకునేందుకు ప్రిపేరైందట.. ముంబై, ఢిల్లీ, ఇండోర్, పూణే, భోపాల్, చైన్నై కేంద్రం ఎంపిక చేసిన 20 నగరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది..కానీ ఇవే కాదు ముందు ఉండాల్సినవి అహ్మదాబాద్, హైదరాబాద్, కోల్‌కతా..ఇన్నెందుకు ప్రతి మెట్రో సిటీతో పాటు..జనసమ్మర్థం ఉన్న ప్రతి ఏరియాలో కూడా ఈ టెస్టులు ఉండాల్సిందే..
ఎక్కడైతే కరోనా టెస్టులకు పాజిటివ్‌గా తేలిన కేసుల నిష్పత్తి ఎక్కువగా ఉందో..ఆ ప్రాతిపదికనే ఈ 20 నగరాల
ఎంపిక చేసారంటున్నారు..ఆ లెక్కన ఏపీలో కర్నూలు..నరసరావుపేట కూడా ఉండాలి.... ఈ నగరాల్లో భారీగా జనాభాతో పాటు..పాజిటివ్ కేసుల క్లస్టర్లలో స్పెషట్ ట్రీట్‌మెంట్ అవసరమని కేంద్రానికి అందిన
అంతర్గత నివేదిక ద్వారా తెలుస్తోంది..జూన్ నెల మొదటివారంలో టెస్టులను ఎలా నిర్వహించాలనే అంశం, అనుసరించాల్సిన స్ట్రాటజీపై ఓ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు...ఇందులో కొత్తగా ఏం ఉండదు.కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ చాలా తక్కువగా ఉందని చెప్తారు..వాస్తవానికి అదెప్పుడో జరిగిపోయింది..
జులై నాటికి కరోనా కేసులు 5 లక్షల నుంచి 7లక్షలమందికి సోకవచ్చని కేంద్రం వద్ద అంతర్గత నివేదిక ఉంది..దీని ఆధారంగానే అవసరమైన వైద్యపరికరాలు..డ్రగ్స్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ అంతా రెడీగా ఉంచినట్లు కేంద్రవర్గాలు చెప్తున్నాయ్. ఐతే ఇంతకు మించి కేసులు పెరిగి వరస్ట్ కేస్ సినారియోకి దారి తీస్తే మాత్రం దేశవ్యాప్తంగా వైద్యశాఖపై ఒత్తిడి పెరగడం ఖాయమంటున్నారు..వైద్యవ్యవస్థ కుప్పకూలితే..అది ఇటలీ, స్పెయిన్ తరహా దారుణాలకు దారి తీయవచ్చు..8లక్షల నుంచి పదిలక్షలకు సోకితే ఆ దేశాల తరహా సీన్లు ఇక్కడ కన్పించే ప్రమాదముంది..ఐతే ఆ పరిస్ధితి దాపురించాలంటే రోజుకి పదివేలకి పైగానే కేసులు నమోదు కావాలి..ప్రస్తుతానికి ఆ సూచనలు కన్పించడం లేదనే అంటున్నారు..ఐతే అది కూడా పాలసీలో మార్పులను బట్టే చోటు చేసుకోవచ్చంటున్నారు.. టెస్టింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టాలా...ట్రీట్‌మెంట్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టాలా అన్నప్పుడు ఈ రకమైన పరిస్థితులు ఏర్పడవచ్చు..ఇప్పటికే దేశంలో లక్ష కేసులకు దగ్గర పడిన సందర్భంలో..వైరస్ వ్యాప్తి ఇక తూర్పు రాష్ట్రాలవైపు పయనించే సూచనలు మొదలయ్యాయ్...వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు అనుమతించడంతో..బీహార్, ఒడిశాలో కొత్తగా మూడింతలు కేసులు పెరగడమే ఇందుకు నిదర్శనం
ఐతే వలసకార్మికుల ఆగమనాన్ని ముందే ఊహించి ఉన్న చోట్ల క్వారంటైన్లకు పంపుతున్నారు కాబట్టి..వైరస్ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపించకపోవచ్చనే అంచనాలు ఉన్నాయ్..ఓ వైపు పశ్చిమబెంగాల్ కూడా టెస్టింగ్ పెంచడంతో కేసులను అదుపు చేసే ప్రక్రియ ప్రారంభమైందనే అంచనాలు నెలకొన్నాయ్..ఐతే ఇక్కడే కొ్న్ని రాష్ట్రాలు
టెస్టులు తక్కువగా చేస్తుండటం కూడా కేంద్రం దృష్టికి వచ్చింది..గుజరాత్, తెలంగాణ ఈ రకమైన చావు తెలివితేటలు ప్రదర్శిస్తూ..దానికి ఐసిఎంఆర్ పేరు వాడుతున్నాయ్..మ హారాష్ట్రలో టెస్టింగ్ పెరిగేకొద్దీ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే పరిణామంగా చెప్తున్నారు.. జూన్ నుంచి జరిగే ఈ టెస్టులను ఎలిజా.-ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునో సార్బెంట్ యారే పద్దతిలో యాంటీబాడీ టెస్టుల రూపంలో చేస్తారు.వీటితో ఎంతమందికి గతంలో వైరస్ వచ్చి తగ్గిపోయిందనే ఫలితం కూడా తెలుసుకునే వీలు కలుగుతుంది..
Comments
Post a Comment