ఏపీ ప్రతిిపక్షనేతగారు..మీడియా స్వేఛ్చపై మాట్లాడటం చాలా ఛండాలంగా ఉన్నా..అది కొంతమందికి చల్లగాలిగా ఉండొచ్చు..తనకి వ్యతిరేకంగా డిస్కషన్స్ చేస్తున్నారని కొమ్మినేని శ్రీనివాసరావనే వ్యక్తిని ఎన్‌టివి నుంచి తొలిగించిందాకా ఏపీలో ఎన్‌టివి రాకుండా బ్యాన్ చేయించారని అంటారు..వాస్తవం కూడా ఆ విషయాన్ని కొమ్మినేనే చాలాసార్లు చెప్పాడు..సరే అది వదిలేద్దాం..ఆ తరువాత వైఎస్సార్సీపీ ఫాలోయర్ పెద్దల సభకు అంటూ లోకేష్ పై కార్టూన్ వేస్తే కేసులు పెట్టారు..బెదిరించారు..అది కూడా చూసాం..
ఇదంతా వదిలేసి పాపం బాబుగారు తానేం చెప్తే అదే జనం వింటారని..నిజం అనుకుంటారనే భ్రమలో పత్రికాస్వేఛ్చపై బిల్డప్ ఇవ్వడం ప్రారంభించారు..వాస్తవమే పత్రికాస్వేఛ్చ ఉండాల్సిందే..వ్యతిరేక వార్తలపై జులుం చేయకూడదు..కానీ వ్యతిరేక వార్తలకు..తప్పుడు వార్తలకు..అంటే అసత్యాన్ని సత్యంలాగా ప్రచారం చేయడం ఒకటి కాదు..మీరు వ్యతిరేక వార్తలు రాసినందుకు అరెస్ట్ అని గొంతు చించుకున్నా నమ్మేవాళ్లెవరు లేరు..కావాలని ఒకడు ఇంకో ఎంప్లాయిలాగా వీడియోనో.,ఆడియోనో క్రియేట్ చేసి దాన్నే వార్తలాగా ప్రసారం చేయడం వ్యతిరేక వార్తా..కుట్రపూరిత తప్పుడు వార్తా..ఈ మాత్రం 40 ఇయర్స్ ఇండస్ట్రీకి తెలీకుండా ఉంటుందా..తెలుసు తెలిసే తన కరోనా పాలిటిక్స్‌ని జనంలోకి వదులుతున్నారు..ఈ రోజున ఫేక్ ఏదో..రియల్ ఏదో జనాలకు తెలీనంత రాకెట్ టెక్నాలజీ ఏం లేదు
ఇక పైన చూడండి..ఏకంగా ఐదారుగురు లీడర్లు ఇచ్చిన కామెంట్లను ఏదో పెద్ద భారీ సమస్యపై స్పందనలాగా..ఏపీలో మద్యం షాపులపై స్పందన అట...మందు షాపులు కొత్తగా ఓపెన్ చేస్తున్నారా..లేక కేంద్రం పర్మిషన్ ఇస్తేనే ఓపెన్ చేస్తున్నారా..దానికి పరిమితం కాకుండా..వైరస్ వ్యాప్తికే ఓపెన్ చేసారని ఒకడు..కమిషన్ల కోసమని ఒకడు..వాగుతూ తమ గౌరవాన్ని తామే తగ్గించుకుంటున్నారు..ఓవైపు నాటుసారాని వలంటీర్లే తయారు చేస్తున్నారంటాడు.మరోవైపు మళ్లీ కమిషన్ల గోల అంటూ వాచాలత్వం.. ఇంకొకడేమో సామాజిక దూరం పాటిస్తూ పరీక్షలు జరపాలట..ఈ ప్రబుద్దుడే అంతకు ముందు వెంటనే స్కూళ్లని బంద్ చేయాలన్నాడు( అప్పటికే స్కూళ్లు నిలిపివేసారు కూడా) ఇంకొకడేమో మాస్క్‌ల పంపిణీలో అవినీతంటాడు..అంటే ఏ కదలికలోనైనా అవినీతి అనగానే జనం ఏ ఒక్కటైనా నమ్ముతారేమో అనే వెర్రి నమ్మకం..కాదు అది వాళ్ల నైజం..ఈ ఆరోపణ చేసిన వ్యక్తి కాళేశ్వర్రావ్ మార్కెట్‌లో డైలీ కమీషన్ల దందా పోయిందని ఇంటర్నల్‌గా వాపోతున్నాట్ట మరి
Comments
Post a Comment