ఎందుకంటే...ఇంతవరకూ సాక్షి పత్రికలో ఎవరి జీతాలు కోయలేదు..ఎవరికీ అడ్డంగా పంగనామాలు పెట్టలేదు..పదిమందికి నీతులు చెపుతూ..మరో వెయ్యిమందికి ఉపాధి కల్పించే హోదాలో ఉన్న అంధ దిక్చూచి మాత్రం ఏకంగా ఇళ్ల నుంచి పని చేయమని పురమాయించడం..ఆ పైన వాళ్లకి సగం జీతాలు మాత్రమే సరఫరా చేయడం చూస్తే..మొదటిదాన్ని మెచ్చుకోకుండా ఎలా ఉంటారు
బోలెడన్ని ప్రశ్నలు..ఛాలెంజులు సదరు ఛానల్లో...ఎవరైనా జీతాలు కోస్తే ప్రభుత్వం ఊరుకోదు..మేమూ ప్రశ్నిస్తామంటూ ఊకదంపుడు చర్చలు చేస్తూ..గత రెండు నెలలుగా ఇదే పని...కొంతమందికి అసలు రావద్దని చెప్పేయడంతో రోడ్డున పడ్డ సదరు పత్రికా విలేకరులకు ఎవరు దిక్కు..?
లేదూ జీతాలకు భరోసా లేని వృత్తి ఎంచుకున్నందుకు వారికా శిక్ష తప్పదా...? అనుభవించాల్సిందేనా అలా..?
అక్కడికేదో ఈ రెండు నెలల్లోనే నష్టాలు వస్తున్నట్లు..మరి ఇన్నాళ్లూ అంత లాభాల్లో నడిచేవైతే..ఆ లాభాల్లోంచి కాస్త తీసి ఉద్యోగులకు రెండు నెలలు సర్దుబాటు చేయవచ్చుగా..లేదా..చేయలేదా..సరే వదిలేయండి..మీరు చేయని పనులను మరి ఇతరులకు చెప్పడం ఎందుకు..? సంస్థలు నడవకపోయినా జీతాలు ఇవ్వాల్సిందే అంటూ ప్రధానమంత్రి చెప్పారు..కానీ ఆ నొప్పి సంస్థలకే కదా తెలిసేది..ఇదే విషయాన్ని జగన్ ఎత్తి చూపించాడు..ఐనా తాను మాత్రం తన సంస్థల్లో వారికి ఇస్తూనే ఉన్నాడు..మరి అలాంటప్పుడు మెచ్చుకోకుండా ఎలా ఉంటారు..ఇందులో ఎవడైనా ఇంకో కోణం వెతికితే..వాడి ఉద్యోగం ఊడిపోతే..అప్పుడు వివరం బోధపడుతుంది..

ఆంధ్రజ్యోతి సగం జీతాలే ఇచ్చిందని ప్రూఫ్ ఉందా?
ReplyDeleteమీకు ఏ సంస్థపై అనుమానమున్నా..సదరు సంస్థ ఉద్యోగులకు కాల్ చేసి అడగవచ్చు నో ప్రాబ్లెమ్
ReplyDeleteనాకు ఆ సంస్థలో ఎవ్వరూ తెలియదు. మీకు పై విషయం ఎలా తెలిసిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.
Deleteఎలా తెలుసుంటే...నేను మీడియాలో పని చేస్తాను కాబట్టి..
ReplyDeleteమీరు మీడియాలో పని చేస్తారు. ఈ రోజుల్లో మీడియాని అస్సలు నమ్మకూడదు.
Delete