అయ్యా మోదీగారూ మీరు డబ్బుల కోసం వెతుక్కోనక్కర్లేదు ఆ పని చేయండి..మా దరిద్రం తీర్చండి


కరోనాతో లాక్‌డౌన్..లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోవడం ఓ చక్రంలాగా అన్ని చోట్లా జరుగుతున్నదే..ఐతే కొన్ని దేశాలు మాత్రం వారి పౌరులకు భారీగా సాయం చేయగలుగుతున్నాయ్..మరి కొన్నివాటికి చేతనంత సాయం అవి చేస్తున్నాయ్..మరి మన దేశంలో  మాత్రం 20లక్షలకోట్ల రూపాయలతో భారీగా ప్యాకేజీ ప్రకటించారు.ఐతే ప్యాకేజీ నంబర్లైతే భారీగా ఉన్నాయ్ కానీ..వాస్తవంగా  ఎంతమందికి సాయం అందుతుందో చెప్పలేం


కేంద్రం దగ్గర గత ఏడాది స్పెండింగ్ బడ్జెట్ మొత్తమే 30లక్షల కోట్లు..అలాంటప్పుడు 20లక్షల కోట్ల రూపాయలు ఎలా ఈ ఒక్క ఆర్దిక సంవత్సరంలోనే ఖర్చు పెడుతుందనే సందేహాలు మొదట్నుంచీ ఉన్నాయ్..అందుకే మొత్తం బెయిలౌట్ ప్యాకేజీలో కనీసం ఓ మూడులక్షల కోట్లమేరకైనా..నగదు చెల్లింపులు ఉండొచ్చని అంచనా వేసారు..కానీ
వాస్తవ పరిస్థితి చూస్తే అందులో కూడా పావువంతు కూడా లేకపోవడం దారుణం. కానీ ప్రపంచంలోని ఏ దేశంలో కూడా డైరక్ట్ మనీ బెనిఫిట్స్ లేకుండా స్టిమ్యులస్ ప్యాకేజీలు  వర్కౌట్ కావనే అంటున్నారు..ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఆర్థిక సంవత్సరం అంతా కూడా బెయిలౌట్ ప్యాకేజీ వర్తిస్తుందని చెప్పారు కాబట్టి తర్వాతేమైనా ప్రకటిస్తారేమో చూడాలి..
స్థూలంగా కేంద్రం ఖర్చు పెట్టబోతోంది..మొత్తం జిడిపిలో 10శాతం కాదు..2.1శాతమే...వాస్తవం ఇలా ఉండగా..గొప్పగా ప్రకటనలతో ఊదరగొట్టడం వలన ప్రయోజనం శూన్యం..ఎందుకంటే లక్షలాది మంది వలసకూలీలు ఇప్పటికీ రోడ్లపై వందలాది కిలోమీటర్లు నడిచిపోతున్నారు..ఆ కన్నీటి కథలకు అంతే లేదు. ఓ వైపు లక్షలకోట్లలో ప్రకటనలు వస్తున్నా..ఈ కార్మికుల ఆకలిబాధలు తీరడం లేదు..కనీసం ఆ భరోసా కూడా లేదు..అంటే ఇక్కడ వలసకార్మికులకు విశ్వాసం కల్పించడంలో కేంద్రం ఘోరంగా విఫలమైంది..పైగా ఇది ఇప్పటికిప్పుడు వచ్చిపడిన వైఫల్యం కాదు..ఎన్నో ఏళ్లుగా గొప్పగా బాకాలు ఊదుకుంటున్న మన ఆర్థిక వ్యవస్థలోని డొల్లతనం..దేశం మొత్తం రెండునెలలు రోజులు స్తంభినా..కనీసం కుటుంబానికి రెండువేల రూపాయలు కూడా ఇవ్వలేని పేదదేశం మనది..ఇందుకు ఎవరినో తప్పుబట్టక్కర్లేదు..ఏ రంగాలకు ఖర్చులు పెట్టాలో..ఏ రంగాన్ని అభివృధ్ది చేయాలనేది ఇప్పుడు కరోనా కారణంగానైనా తెలిసి వస్తోంది..అటు ఆరోగ్యపరంగానూ దేశంలో సగానికిపైగా జనాభాని ఆదుకోలేని పరిస్థితి..ఆర్థికంగానూ అంతే మూడింట ఒకవంతు జనాభా అడ్డంగా రోడ్డున పడేసిన లాక్‌డౌన్..మన వ్యవస్థలలోని లోపాలను ఎత్తి చూపింది..

 మరి దేశ ఆర్థికవ్యవస్థే చితికిపోయింది..కేంద్రం దగ్గరా డబ్బు లేదు..ఇలాంటప్పుడు ఎవరైనా ఏం చేయగలరనే ప్రశ్న రాకతప్పదు.మనసుంటే మార్గం ఉండకపోదు..ఎన్నికలకు ముందు పేదరికం పోయేందుకు ఎన్డీఏ ఓ బ్రహ్మాండమైన స్కెచ్ వేసింది..నల్లధనం..ఎస్ విదేశాల్లోని నల్లధనాన్ని లాక్కురాగలిగితే..దేశం దరిద్రం వదిలిపోతుందని అప్పట్లో ఊదరగొట్టారు..ఎన్నికల తర్వాత..ఆ నినాదం తమది కాదన్నారు..సరే ఇప్పుడు సంక్షోభం వచ్చింది కాబట్టి..ఆ దిశగా ఎందుకు ఆలోచించరనే సందేహం కలగకమానదు..విదేశాల్లో పోగుపడిన నల్లధనం విలువ 15లక్షలకోట్లపై మాటే అని చెప్తూ ఉంటారు..ఇలాంటప్పుడు అన్ని షరతులు..నిబంధనలు ఎత్తేసి ఆ డబ్బు తీసుకరాగలిగితే దేశాన్ని ఆదుకున్నట్లు కాదా..మన దగ్గర ధనం లేనప్పుడు అప్పు తీసుకోవడం మామూలే..కానీ దాదాపు ప్రతి పార్లమెంట్ సెషన్స్‌లో బ్లాక్ మనీ ప్రస్తావన వచ్చినప్పుడు కేంద్రం దానికోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్తుంటారు..ఆ ప్రయత్నేమేదో ఇప్పుడు చేయకూడదా..దేశంలోని ప్రతి పేదవాడి అక్కౌంట్‌లో అక్కర్లేదు..లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయినవారి అక్కౌంట్లలో ఒక్క పదివేలు వేస్తే సరిపోదా..ఈ ప్రశ్నలే ఇప్పుడు కొందరు సంధిస్తున్నారు

డబ్బుల గురించే ఇంతగా ఎందుకు చెప్తున్నారంటే..జనం దగ్గర డబ్బులుంటేనే ఆర్థిక పరిస్థితి ఊపందుకుంటుంది.. అంతకన్నా మంచి దారి ఇంకొకటి ఉండదు.  లోకల్‌ మార్కెట్లలో డిమాండ్ పెరగాలంటే ఇదే మార్గం..ఇదే విషయాన్ని కార్పోరేట్ కంపెనీల అధిపతులు కూడా ఒప్పుకుంటున్నారు.వస్తువులకు, సేవలకు డిమాండ్‌ పెరగడం ద్వారానే ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ జరుగుతుంది. ఐతే ఈ నిర్భర్ భారత్ ప్యాకేజీలో ఎక్కడా అలాంటి ప్రస్తావనే లేదు
రో్డ్లపై రైల్వేట్రాకులపై నడిచిపోతోన్న వలసజీవులు ఈ దేశంలో భాగం కాదని..కేంద్రంలోని పెద్దలు భావించారేమో అనే సందేహం కలగకమానదు..వాస్తవానికి ఈ వలసకూలీలు లేకపోతే..రేపు పూర్తిగా కర్మాగారాలు వ్యాపారాలు పూర్తిగా తెరుచుకున్నా..పనులు మొదలుకావు..కానీ స్వగ్రామాలకు వెళ్తున్నవారిలో సగంమంది ఈ నగరాలకు తామిక రామని తెగేసి చెప్పడం..ప్రభుత్వాలు వారికి నమ్మకం కలిగించడంలో విఫలమయ్యాయనడానికి నిదర్శనం..ఈ  చిన్నజీవులపై నిర్ల్లక్ష్యం, కార్పోరేట్ కంపెనీలపై పక్షపాతం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది..ఎకాఎకిన కార్పోరేట్ ట్యాక్స్ కట్ చేయగలిగిన ప్రభుత్వం..కష్టకాలంలో ఆ కంపెనీలనుంచి ఏ మాత్రం  సాయం పొందిందో కూడా చూడాలి...లాక్‌డౌన్‌కి ముందు దేశంలో ఒక్క పిపిఈ కిట్ కూడా సొంతంగా తయారవడం లేదు..ఇప్పుడు మాత్రం రోజుకు లక్షలసంఖ్యలో తయారు చేయగలుగుతున్నాం అంటే..అది మన సమర్ధతకి చిహ్నమా..లేక..ఇన్నాళ్లూ ఇంత పెద్ద దేశంలో ఒక్క కిట్ కూడా తయారుచేయడంపై శ్రద్ధ పెట్టడం లేదంటే మన ప్రాధాన్యాల క్రమంలో వైఫల్యమా చూడాలి...పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ తయారీలో లాభాలు రావు..అందుకే కార్పోరేట్ కంపెనీలు తయారు చేయడం లేదు..ఇదే నిజం


 ఇంకా ఇంత పెద్ద ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం తాను మూడు నెలలకు కలిపి ఒక్కో రైతుకి వేసిన రెండు వేల రూపాయల గురించో..జన్ ధన్ ఖాతాల్లో 1500 రూపాయల గురించో గొప్పలు చెప్పుకుంటుంది కానీ..ఇదే ఇతర దేశాల్లో ఎలా సాయం చేస్తున్నారో తెలిస్తే..మన పేదరికానికి మనమే జాలిపడాలి...కెనడా దేశంలో లాక్‌డౌన్‌తో
ఉపాధి కోల్పోయిన వారికి నెలకి 1400 డాలర్లు అంటే  లక్షామూడువేల ఆరువందల రూపాయల చొప్పున నాలుగు నెలలు ఇస్తోంది.ఇది డైరక్ట్ క్యాషే..ఇదే మనం అసలు ఈ మూడు నెలలు ఉద్యోగాల జీతాల సంగతి పక్కనబెడితే..ఉంటాయో ఊడతాయో తెలీని పరిస్థితి.. ఇదే పేద దేశాలకు..వర్థమాన దేశాలకు..అభివృద్ధి చెందిన దేశాలకు తేడా..ఇక్కడా మనది మధ్యతరగతే..అంటే అటు సాయం చేయండంటూ విరాళాలు పోగుచేసుకోలేం..ఘనంగా సొంతంగా డబ్బులూ ఖర్చులు చేసుకోలేం. కోస్టారికాలాంటి చిన్న దేశం కూడా వైరస్ దెబ్బకి ఉద్యోగాలు ఊడినవారికి నెలకి 220 డాలర్లు అంటే దాదాపుగా పదిహేడువేల రూపాయలు చెల్లిస్తోంది..అమెరికా 99వేలడాలర్ల ఆదాయంలోపు ఉన్నవారికి 1200 డాలర్ల చొప్పున ఆర్థికసాయం చేస్తోంది..అంటే నెలకి 91వేల52రూపాయలు ఉపాధి కోల్పోయిన పౌరులకు చెల్లిస్తోంది..హాంకాంగ్ దేశం 18ఏళ్లు దాటిన 70లక్షలమంది పౌరులకు పదివేల హాంకాంగ్ డాలర్లను ఆర్థికసాయంగా ప్రకటించింది..అంటే  దాదాపుగా 98వేల రూపాయలు..ఇదంతా కూడా క్యాష్ రూపంలోనే..ఈ లెక్కలు చాలు కదా మన ఆర్థికవ్యవ్యస్థ ఎంత పేలవంగా ఉందో తెలియడానికి.. ఎక్కడ పదిహేను వందల  రూపాయలు..ఎక్కడ లక్షరూపాయలు.. ఇంత తేడా ఎందుకంటే..అవి డెవలప్డ్ నేషన్స్...మనది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే. మరి ఈ తేడా ఎలా పోవాలి అంటే..అది ప్రభుత్వ విధానాల్లో మార్పులతోనే సాధ్యపడుతుంది. గత వారం రోజులుగా పాలనలోనూ..పాలసీల్లోనూ బీభత్సమైన మార్పులు తీసుకురాబోతోన్నట్లు ప్రచారం జరుగుతుంది..అవి నిజంగా వర్కౌట్ అయితేనే ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనగలిగేది..లేదంటే గాల్లో దీపం పెట్టి దేవుడ్ని ప్రార్థించడమే

Comments