సోనూ సూద్ ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే..He is on a mission





కేరళలో సొంతూరుకి వెళ్లేందుకు వేరే దారి లేక అక్కడే ఉండిపోయిన 177మందిని సోనూ సూద్ ఓ ఫ్లైట్ పంపించి మరీ స్వస్థలాలకు పంపడమంటే..మామూలు విషయం కాదు..అసలా ఆలోచనే రాదు చాలామందికి..ఎలా అప్రోచ్ అయ్యాడో..ఎవరిని కాంటాక్ట్ అయ్యాడో  అయ్యాడు..ఎలాగైతేనేం వారందరినీ స్వస్థలాలకు పంపించగలిగాడు..

కనీసం ఇలాంటివి చూసినప్పుడైనా ప్రభుత్వాలకు..కాస్తో కూస్తో సాయం చేయగలిగే స్థాయి  ఉన్నవాళ్లకి కాస్తైనా గుండె కదలదా..మహా అయితే సోనూ సూద్ ఎంత సంపాందించి ఉంటాడు..ఓ మూడొందల కోట్లు..లేదూ ఓ 500కోట్లు..అందులో..ఈ రెండునెలల్లో అతను ఎంత తిరిగి సమాజానికి ఇచ్చి ఉంటాడు..ఆలోచిస్తే..ఇదే కదా జీవితం అన్పించకమానదు..ఇతనొక్కడే కాదు..అక్షయ్ కుమార్ కూడా ఇదే తరహాలో స్పందిస్తున్నాడు..ఎందుకంటే వాళ్లకి తిరిగి సంపాదించుకోవడం ఎలానో తెలుసు..అందుకే ఎలాంటి సంకోచం బెరుకూ లేకుండా సహాయం చేయగలగుతుున్నారు.. ఓవేళ ఇక్కడే జీవితం ఆంతమైతే..ఈ ఆలోచనే చాలామందిలో కరోనా కలిగిస్తోంది..తమలోని పీనాసితనాన్ని కొద్దిబుద్దులను పక్కనబెట్టేలా చేస్తోంది...
మనకి ఇళ్లు కట్టించినవారు నీడ లేక రోడ్లపై పడటం నేను చూడలేకపోతున్నా అని..ఇరవైఏళ్ల క్రితం తాను కూడా ముంబైకి వలస వచ్చినవాడినే అంటూ సోనూ సూద్ చూపించిన మార్గం ఇతరులు కూడా ఎంతో కొంత ఫాలో అవ్వాల్సిందే..మైగ్రెంట్ వర్కర్ల కోసం ఓ హెల్ప్ లైన్ నంబర్ పెట్టి మరీ సాయం చేస్తున్నాడంటే..ఇతని  ఆలోచనావిధానం ఎలాంటిదో తెలిసిపోతుంది కదా..


ఇక సోనూ సూద్ ఎందుకు జాగ్రత్త పడాలంటే..ఇదివరకటిలా ఆయన్ని ముంబై జనం చూడరు..బాలీవుడ్ కూడా ఆయనకి శాడిస్ట్..విలనీ క్యారెక్టర్లు ఇవ్వాలంటూ సంకోచించాల్సి వస్తుంది..ఎందుకంటే..ఏ హీరో చేయని విధంగా ఆలోచన ఉండాలే కానీ  ఎలాగైనా ఆదుకోవచ్చుంటూ నిరూపించాడు..మరిలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం ప్రదర్శించిన తర్వాత లేకి క్యారెక్టర్లలో జనం అంగీకరిస్తారా...సినిమా వేరు జీవితం వేరు అనవద్దు..

డెఫినెట్‌గా కరోనా తర్వాత..సోనూ సూద్ నటించబోయే క్యారెక్టర్లలో మార్పు వస్తుంది..ఇది నిజం..టైమ్ అది మీకు నిరూపించి తీరుతుంది..

Comments

  1. సినిమా వేరు జీవితం వేరు. అందుకే ముసలి వయసులో కుర్ర పిల్లలతో గంతులేసినా పట్టించుకోలేదు. కానీ లేట్ వయసులో లవ్వులు పెళ్లిళ్లు అంటే మాత్రం ఛీకొడుతున్నారు

    ReplyDelete

Post a Comment