అరే..పవన్..బాబు ఇద్దరిదీ భలేగా ఒకటే మాట..ఈనాడేమైందబ్బా డ్రోన్లు ఎగరేసారా ఏంటి



ఒకే రోజు ఇద్దరు మిత్రులూ ఒకేసారి కూడబలుక్కున్నట్లు ఆంధ్రప్రదేశ్‌పై తమ కన్సర్న్‌ని హైదరాబాద్ నుంచే భలే వ్యక్తం చేసారు.ఐతే ఈ ఇద్దరి మాటల్లో హెడ్డింగ్ కూడా చూడండి...ఇప్పుడీ పాయింట్లతోనే రాత్రికి ఆ రెండు ఛానళ్లు డిబేట్లు పెడతాయన్నమాట..ఎంద దారుణమండీ ఇదీ అనుకుంటూ..మళ్లీ రేపొద్దున్న వాటినే పట్టుకుని ఈయన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇరగదీస్తాడన్నమాట..ఏవండీ అన్నామంటే అన్నారని గింజుకోవడం కాదు కానీ...దక్షిణాదిలో ఏపి మాత్రమే మందు అమ్ముతుందా...? కేరళ ఇప్పుడు కాదు పది హేను రోజుల క్రితమే అమ్మకం చేసింది..మళ్లీ ఆపేసింది.. కేరళ హై కోర్టు స్టే ఇవ్వడంతో ఇప్పట్లో దాని జోలికి పోదలుచుకోలేదు..కర్నాటకలో ఒక్క రోజులోనే 45 కోట్ల వేల్యూ కలిగిన బాటిళ్లు అమ్ముడుపోయాని చెప్తున్నారు..
ఇదిగో కింద లింక్ https://www.thenewsminute.com/article/karnataka-reports-rs-45-crore-worth-liquor-sales-first-day-after-stores-reopen-123935
తమిళనాడులో కూడా అంతా రెడీ చేసుకున్నారు..కానీ కోయంబేడులో ఒక్కసారే వందలమందికి కరోనా బైటపడటంతో..( మందుతో కాదు మహానుభావుల్లారా అదో మార్కెట్) వెంటనే ఓపెన్ చేయలేదు..కానీ మే 7 నుంచి అమ్ముతామని గ్యారంటీ ఇచ్చింది..దీనికి పోయి దక్షిణాదిలో ఎవడూ అమ్మడం లేదని..తెగ అంగలార్చేబదులు అసలు ఏడుపేందో చెప్పుకోవచ్చు కదా..అరే ఒక్క మరణం కూడా లేదే..గత వారం నుంచి..ఏమని విమర్శించాలి..ఎలా విమర్శించాలి..ఆ..ఇదిగో ఇప్పుడు దొరికిందిగా సందు అని బయలుదేరారు జంటకవులిద్దరూ

పైగా ఏదో ఎవరో ఎక్కడో నిజంగానే చూసినట్లే టీచర్లని పెట్టారు మందు షాపులదగ్గర అంటూ ఒకటే కామెంట్..ఒకటే సమయంలో..ఇలా ఒక అబద్దం పదే పదే చెప్తే ఎవడో ఒకడు నమ్ముతాడనా..ఈ పై మహానుభావుడే..ఈ సమయంలో కూడా రాజకీయాలు చేస్తే జనం తిరగబడతాడని గత వారం ముసుగు స్టేట్ మెంట్ ఇచ్చింది..మరిప్పుడు ఈ ఇద్దరు పెద్ద మనుషులు చేస్తుందేంటి..? నీకంత మందుపై అసహ్యం ఉంటే సినిమాల్లో తాగకు..బైటా తాగకు...మందుని వదిలేయమని నీ ఫ్యాన్స్ కి చెప్పు జనసైనికులు ఎటూ తాగరు కదా..అక్కడికేదో మీరిద్దరూ మహాపురుషులు..మిగలినవాళ్లంతా మందుభాగ్యుల్లాగా... ఈ టెలీ కాన్ఫరెన్స్ లేదంట..ఎవడు ఎవడితో చేస్తున్నాడు..దీనికైమైనా రుజువు ఉందా..కేవలం ఈనాటి అవసరం కోసమే ఈ ప్రసంగాలా...?

Comments

  1. Great minds think alike అన్నారు కదా. రేపో మర్నాడో ఇవే వాదనలు ముప్పావల వంకాయల నాయుడు, డ్రామోజీ రావు, లోకసత్తా జోక ప్రకాశ్, చికెన్ నారాయణ, అంధకోతి బాధాకృష్ణ, కుండబద్దలు డబ్బారావు వగైరాలు కూడా ఎత్తకుంటారేమో.

    బైదవే ఈ మేతావుల జాగ్రఫీ ప్రకారం కర్ణాటక దక్షిణ భారతంలో రాదు!

    ReplyDelete
  2. మంచి అబ్జర్వేషన్ ....

    ReplyDelete

Post a Comment