కనీసం రాహు‌ల్‌గాంధీని చూసైనా..పవన్ కల్యాణ్ మైండ్ సెట్ చేసుకోలేరా


విశాఖపట్నంలో జరిగిన ఇన్సిడెంట్‌పై స్పందించడానికి కానీ..విమర్శించడానికి కానీ ప్రాతిపదిక వెతుక్కోవాల్సిందే కానీ...ఎవరిని తప్పుబట్టాలి..? ఎక్కడో ఏదో ఫ్యాక్టరీ జనావాసాల్లో ఉంటే అదెప్పుడు బద్దలవుద్దో తెలీని యంత్రాంగాన్నా...లేక గతంలో అది పెట్టినప్పుడు పరిసరాల్లో నివాసాలు లేవ్..కానీ ఆ తర్వాత వచ్చి చేరుతుంటే ఇది ప్రమాదం అని హెచ్చరించలేని తెలివిడి లేని అధికారులనా..లేక ఓ పక్కన ఫ్యాక్టరీలు..పరిశ్రమలు దగ్గర్లో ఉంటే..అక్కడ ఉండటం శ్రేయస్కరం కాదని తెలిసీ అక్కడుండే వారినే బాధ్యులు చేయాలా...అందరి తప్పులుూ ఉంటాయ్..
ఐతే ఇందులోంచి నేర్చుకోవాల్సి న విషయాల్లో...లాక్ డౌన్ ఎత్తేయగానే ఎగేసుకుని పనులు ప్రారంభించే రసాయన కర్మాగారాలు ముందుగా మేలుకోవాలి..తామెంత ప్రమాదకరమైన పని చేయబోతున్నారో చుట్టుపక్కల వారికి వివరించాలి..అలానే బల్లకట్టు ప్రమాదాలు జరిగితే..బల్లకట్టు...గ్యాస్ లీకైతే..ఫ్యాక్టరీలు..రోడ్డు ప్రమాదాలు జరిగితే రవాణా యంత్రాంగాలపై  అప్పటికప్పుడు హడావుడి చేయడం తప్ప..అదో నిరంతర ప్రక్రియగా మారకపోవడమే ఎక్కడైనా జరుగుతోన్న లోపాలు..వీటికి ఇళ్లలో కూర్చుని రాసే మనమో...లేక కాలక్షేపంగా చదువుకుని తీర్పరులుగా మారే చదువురలో కాదు..జీతాలు తీసుకుంటున్న సంబంధిత అదికారులే బాధ్యులు కావాలి..ఇలాంటి విపత్తులపై ఓ మంత్రిత్వశాఖని ఏర్పాటు చేసినా...సర్వైవైలెన్స్ లేకపోతే పరిస్థితుల్లో మార్పులు రావేమో...

రాత్రికి రాత్రి హాయిగా నిదరపోతున్నవాళ్లని( అప్పటికి కరోనా భయం వెంటాడుతున్నా) ఏం జరుగుతుందో తెలీకుండానే బతుకులు తెల్లవారిపోతే..ఎలా వర్ణించాలి ఆ బాధని..అందుకే ఏ లీడర్లు పెద్దగా ఇందులో విమర్శలకు తావియ్యలేదు..ఎప్పటిలాగానే అదో రొటీన్ కార్యక్రమంలాగా నష్టపరిహారంపై డిమాండ్లు తప్ప...ఐతే దానికి కూడా ముఖ్యమంత్రి భారీగానే జవాబు చెప్పగా..ఇక వేరే మాట లేకుండా పోయింది..

కానీ ఈ వపవన్ కుమారుడున్నాడే..ఈ సమయంలో రాజకీాయాలు ఆక్కర్లేదంటూ ఓ విధివిధానాలకు సంబందించిన డైలాగ్ వేయడం ఆయన సందర్భోచిత వ్యాఖ్యానాలకే అద్దం పడుతుంది..అసలెక్కడ ఎవరు పాలిటిక్స్ మాట్లాడారు..అక్కడికేదో రాజకీయ ముత్తైదువలాగా లేని పోని పెద్దరికం ఆపాదించుకుని మాట్లాడటం తప్ప...ఇలాంటి ఓవరాక్షనే జనాలకు విసుగు పుట్టించేది..ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా...వెంటనే ఓ బయలుదేరి..మావాళ్లు అండగా ఉంటారు...మీ వెనకే ఉంటారు...అంటూ ఏంటీ డైలాగులు..ఎఁదుకు అండగా ఉండాలి..ఎవరి వెనక ఉండాలి..ఎవరి కొంపల్లో వాళ్లు ఉండక..చేసే సాయమేదో గవర్నమెంట్ చేస్తుంది..అందులో ఏదైనా తేడా వస్తే అప్పుడు చూపించండి మీ ప్రతాపం..
ఈ సమయంలో రాహుల్ గాంధీ చూడండి ఎంత బ్యాలెన్స్ డ్‌గా..కేంద్రం ఏం చేయాలో అర్ధవంతంగా సూచిస్తున్నాడు..ఐనా తన పరిమితి తనకి తెలుసు కనుక...హద్దు  దాటకుండానే కేంద్రానికి సలహాలు ఇస్తున్నాడు..చేతనైతే అలాంటి సలహాలు ఇవ్వచ్చుగా ...ఉదాహరణకి టెస్టింగ్ కిట్స్ ఏ దేశంలో బా వున్నాయ్...ఎక్కడ ఎలాంటి సర్వైవలెన్స్ టెక్నిక్స్ వాడుతున్నారు అలాంటి సలహాలు ఇవ్వకుండా..ఏదో పెద్ద జ్ఢానుల్లాగా కాలు కదపకుండానే అనుచిత వ్యాఖ్యానాలెందుకు..

Comments

  1. నేను గినుక సీఎం కురిసీలో ఉండుంటేనా, చూబెడుతును తడాఖా అని చంద్రాలు సారు డయలాగులు బాదాడు. ఎవని పిచ్చి వానికానందం!

    https://andhrajyothy.com/telugunews/chandrababu-comments-visakha-accident-ap-govt-cm-jagan-2020050802293458

    ReplyDelete
  2. ఆయన వేసింది రెండు డైలాగులైతే మీ ఓవర్ యాక్షన్ మరింత ఎక్కువైంది.
    అందరూ మీకిష్టమైనట్లే మాట్లాడాలనుకుంటే అది మీ పిచ్చి.

    ReplyDelete
  3. పవన్ నాయుడు ఎంత మాట్లాడాడో మీకు తెలుసా..లేక టివిల్లో చూసింది మాత్రమే అనుకుంటున్నారా...మాకు నచ్చినట్లు మాట్లాడితే వార్త ఏముంది..వాళ్లలానే ఉండాలి..మా కీబోర్డులకు పని కల్పించాలి...చెన్ద్రబాబుగారు పాపం ఆపుకోలేకపోతున్నారు...ఇంకొన్ని రోజుల్లో ఆయనే స్వయంగా ఛత్..నాకు ఇవ్వండి ముఖ్యమంత్రి కుర్చీ..నే చూపెడతా ఎలా పాలన చేయాలో అనకపోతే చూడండి

    ReplyDelete
    Replies
    1. పవన్ నాయుడు ఎవరు?

      Delete
  4. చంద్రాలు సారు చంచాలకు చంద్రభజన తప్పవిడిచి ఇంకోటి రాదు పాపం!

    ReplyDelete
  5. ఐఏఎస్‌లకు ఏం తెలుసు?

    https://m.sakshi.com/news/politics/chandrababu-comments-ias-officers-about-gas-leakage-vishaka-1284334

    ReplyDelete

Post a Comment