ఈనాడెంత దుర్మార్గమో చూడండి..ఆరోగ్యశ్రీ లో కరోనాని కావాలనే కప్పిపెడుతోందా..ఏ బాసు ఆర్డర్స్ ఇవి



పైకి చెప్పేవి నీతులు..చేసేది మాత్రం నీచమైన కుట్రలు..ఇలా వైెఎస్సార్సీపీ లీడర్లే కాదు..చాలామంది ఈ పత్రికపై దుమ్మెత్తి పోస్తుంటారు..అందుకు తగ్గట్లే ఉంది ఈ వ్యవహారశైలి కూడా..కరోనా జబ్బుని మించిన జబ్బు ప్రస్తుతానికి ప్రపంచాన్ని పీడించడం లేదు..ఇంతకి మించిన ప్రాణాంతక జబ్బులు ఉండొచ్చు కానీ.ప్రస్తుతం ఈ వైరస్ అంటేనే జనం వణికిపోతున్నారు..బంధాలు లేవ్ బంధుత్వాల్లేవ్..అన్నీ వదిలేసి పారిపోతున్నారు..అలాంటప్పుడు ఆ వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చడం ద్వారా పేద జనాలకు ఎంతో ఉపకారం చేసే నిర్ణయం తీసుకుంటే దాన్ని ఇదిగో ఇలా పైన చూపించినట్లుగా ఓ మూల న్యూస్ వేయడాన్ని చూస్తుంటే కడుపు మండదా..

అక్కడికి ఈ న్యూస్ ఏ అర్ధరాత్రి దాటి తెల్లవారి ఝూమునో రాలేదు..రాత్రి 9.30 సమయంలో వచ్చింది..అంటే వేేయాలంటే కావాల్సినంత టైమ్ ఉంది..ఐనా వేయలేదు..(ఇది హైదరాబాద్ ఎడిషన్) కానీ పొరుగురాష్ట్రంలో ఓ సీనియర్ నటి..జయంతి వెంటిలేటర్ పై ఉందనే విషయాన్ని మాత్రం భేషుగ్గా...ఫస్ట్ పేజీలో వేసుకుని తరించింది..
పోనీ ఇది పాత న్యూసే..అనుకుంటే..సున్నావడ్డీకి రైతులకు ఋణాలు అనే నిర్ణయమైనా వేయాలి కదా..మరెందుకు వేయలేదు..అంటే ఈనాడిక పత్రిక కాదు..న్యూస్ రాసేది కాదు..దాని పరమావధి వేరే ఉంది అని ఒప్పుకోవాలి..మేం ఎవరికీ అదరం బెదరం..అంటూ స్క్రోలింగ్స్ వేసుకోవడం కాదు..ఎందుకు ఈ వార్తని ప్రచురించలేదు..డబ్బులిచ్చిన కొన్న చదువరిగా నా హక్కు ఇలా అడగడం...
ఏ  బాసు మీకు ఆర్డర్లిచ్చారు..ఆ ప్రభుత్వం నిర్ణయం పెద్దగా వేయొద్దు..వేస్తే ఇక్కడా అలాంటి డిమాండ్ వస్తుంది అని మీకు ఏ హీరో వార్నింగ్ ఇచ్చాడో చెప్పాలి...

మీ అభిప్రాయాలు..మీరు భుజానికెత్తుకునే డాక్టర్ల ఇంటర్వ్యూలు కాదు..మీ బంధువర్గాల ఇన్ స్టంట్ వేక్సిన్ తయారీల ఊకదంపుడు ప్రచారాలు కాదు..జనాలకు మేలు చేసే..జనాలకు అవసరమైన న్యూస్ ఇవ్వకపోతే..ఏం జరుగుతుందో..ఇంకో రెండు మూడు నెలల్లో క్లియర్ గా అర్దమవుతుంది..మళ్లీ మీకుప్రభుత్వాల ప్రకటనలు కావాలి..వాటితో వచ్చే డబ్బు కావాలి..

Comments