ఏ పార్టీనో కూడా చెప్పుకోలేని రఘురామకృష్ణ ఇంకా వైఎస్సార్సీపీకి అవసరమా..?



సాక్షిలో వ్యాసాలు రాసేవాళ్లు వైఎస్సార్ కాంగ్రెస్‌కి..టిఆర్ఎస్‌కి అనుకూలంగా ఉండేవారితో పాటు ఇతరత్రా మేధావులు..రచయితలు ఉంటారు...ఈనాడులో కూడా బైటికి పెద్ద మనుషుల పోజులు కొడుతూ..ఆ పార్టీకి ఈ పార్టీకి అభిమానులుగా చలామణీ అయ్యేవారితో పాటు..ఫలానా రంగంలోని నిపుణులు కూడా రాస్తుంటారు..ఇక ఆంధ్రజ్యోతికి కూడా  డిటో..ఐతే కాస్త మినహాయింపుతో అప్పుడప్పుడూ అదికార పార్టీ సభ్యులు కూడా ఆంధ్రజ్యోతిలో తమ వ్యాసాలు రాస్తుండటం చూస్తుంటాం..కానీ ఇవాళ పేపర్ చూడండి..పైన ఓ ఎంపిగారు రాసారు..

ఈయనేం కోరుకుంటున్నారో ఆయనకే తెలియాలి..ఆయనకి ముఖ్యమంత్రి గారు అప్పాయింట్ మెంట్ ిఇవ్వడం లేదు కాబట్టి తనకి నోటీసులు ఇచ్చిన పార్టీ కూడా తన పార్టీ కాదనగల సమర్ధుడు..బహుశా రాంగోపాల్ వర్మ తర్వాత ఈయనే మేధావి అని ఆర్జీవీనే ఓసారి చెప్పుకొచ్చాడు..మరి టిడిపి అనే పార్టీ తరపున నోటీస్ ఇస్తే..అది తెలుగుదేశంది కాదని వల్లభనేని వంశీ..సహా నలుగురైదుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీపై తిరగబడాలేమో..అలానే వైకాపా అని భాజపా అని ఎవరైనా రాస్తే..వాళ్లు కూడా ఆ పార్టీల తాలుకూ ఎంపీలు ఎమ్మెల్యేలు కారని..ఆ పార్టీల తాఖీదులు చెల్లవని అనుకోవాలేమో..
పైన వ్యాసం చూసారు కదా..మోదీగారి భజనలో తరించిపోయారు..బహుశా బిజెపి లీడర్లు కూడా ఈ స్థాయిలో ఈ వారంలో ఇలా మోగించి ఉండరు..చిడతలు..ఇలా రాసినందుకు ఏపార్టీ నోటీసులు ఇచ్చీనా...సదరు ఎ్ంపిగారు చూపిన బాటలో కోర్టులకెక్కొచ్చు.. ఈయన పార్టీ ఏంటో కూడా ఆయనే తన నేమ్ లైన్ కింద పెట్టుకోలేని దౌర్భాగ్యం..కాదు కాదు..ఇది పెట్టేది పత్రిక వారంటారా..? మరి ఆ పత్రిక ఎందుకు పెట్టలేదో కూడా ఆయనే చెప్పాలి..లేదంటే ఆ పత్రికే చెప్పాలి..చూస్తుంటే ఇదంతా ఓ సిరీస్‌లో భాగంగానే కనపడటం లేదా...?
ఇంతకీ ఈయన గారి పేరేంటి..రఘురామకృష్ణరాజు అయితే..రఘురామకృష్ణంరాజు అని ఎందుకు రాస్తున్నారు..రేపు పార్టీ కూడా ఇలానే సస్పెండ్ చేసేసి..మేం రఘురామకృష్ణరాజుని చేసేసాం...నిన్ను కాదు అంటే ఎలా ఉంటుంది..

Comments

  1. రాజు గారు ఇలా చిల్లర రాజకీయం చేయడం తనకే అవమానకరం. నీకు నచ్చకపోతే పార్టీ వదిలేసి వెళ్లిపో. అతని వైఖరి చూస్తే ఏ పార్టీ లో ఉన్నా ఇమడ లేడు అనిపిస్తుంది.

    ReplyDelete
  2. బోకు జ్యోతి ఇచ్చే డ్రగ్సుకు బానిస..

    ReplyDelete

Post a Comment