కుప్పం ప్రజలు అమ్ముడుపోయారా..? ఏంటీ శాపనార్ధాలు తాను గెలిస్తే ఓకే..ఇవతలోళ్లు గెలిస్తే ఏకే అన్నట్లు గా..టిడిపి తయారైంది. ఇది వైఎస్సార్సీపీ గతంలో చేయలేదా అంటే కనీసం నాకు గుర్తున్నంత వరకూ చేయలేదు..ఓటమే పెద్ద షాక్ అయినప్పుడు ఇక చిన్న చిన్న  ఓటములు ఏ మాత్రం మనపై పని చేయవన్నట్లుగా జగన్ వైఖరి 2014 తర్వాత ఉండేది..కానీ కుప్పం పంచాయితీల్లో వైఎస్సార్సీపీ 80శాతానికిపైగా గెలిస్తే..అది ఒక గెలుపు కాదని..రెచ్చిపోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి.

కుప్పం ప్రశాంతంగా ఉంది..కుప్పం ప్రజలు అమాయకులు, నీతి కలవారు నిజాయితీ కలవాళ్లు..వాళ్లని కలుషితం చేస్తారా..ఓ మంత్రి కోట్లు పట్టుకుని తిరిగాడు..వైెస్సార్సీపీ నేతలకు జగన్ 90శాతం గెలవాలని టార్గెట్ పెట్టాడు
అంటూ చంద్రబాబుగారు ఆక్రోశించడం చూస్తే ఏంటీయన పద్దతి అనకతప్పదు. ధనబలంతో గెలిచారు అని చెప్పి సరిపెట్టక ఈ జనాలకు మార్కులు సర్టిఫికెట్లు ఏంటంట..ఆ లెక్కన ఇప్పుడు కుప్పం జనాలు డబ్బులు తీసుకుని టిడిపి మద్దతు ఇచ్చిన లీడర్లను ఓడించారనుకోవాలా

జగన్ తన పార్టీ లీడర్లకు90శాతం గెలవాలని టార్గెట్ పెడితే మీ బాధ ఏంటి..మీరు ఎప్పుడూ గెలవాలని కాకుండా ఓడిపోయి రావాలని లీడర్లుకు చెప్పేవాళ్లా కాదు కదా..పైగా పంచాయితీ ఎన్నికలకు కోట్లు పట్టుకుని తిరిగారని వాపోవడం ఏంటి..అక్కడ మీ ఎలక్షన్ కమిషనర్ సారీ..నిప్పు..పులి గడ్డ..నిమ్మగడ్డే కదా ఈసీగా స్వయంగా పర్యవేక్షిస్తోంది..అంటే ఆయన కూడా వీటిని చూసి  ఊరుకున్నాడని మీ ఆరోపణా..ఏకగ్రీవాలైతే బలవంతం అంటారు..గెలిస్తే డబ్బులు పంచి పెట్టారంటారు..ఎట్టా బాబూగారూ...మీతో..అందుకే ఇక రిటైరైపోండంటూ సైటైర్లు పేలుస్తున్నారు 

Comments