స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్షకి రఘరామకృష్ణరాజు కూర్చుంటారా...ఇది నిజమేనా

 

ఎంత మాత్రం కాదు ఎందుకంటే. ఢిల్లీలో ఆయనకి ఉన్న పరపతిని వాడుకుని ఖచ్చితంగా ఆయన స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణను అడ్డుకుంటారు. ఎందుకంటే ఆయనకి మోదీ రేంజ్ స్నేహితులు ఉన్నారు..వైఎస్సార్సీపీని నమ్ముకోవడం దండగ..పైగా ఆ పార్టీ ఎంపిలకు ఢిల్లీలో అస్సలు పలుకుబడి లేదు..ఉన్నదేదైనా ఉంటే అది కేవలం రఘురామకృష్ణంరాజుకే, కేబినెట్ ర్యాంక్ మంత్రులతో టిఫిన్లు బ్రేక్  ఫాస్టులు డిన్నర్లు..భోజనాలు చేయగల చనువు ఆయనకి ఉంది. అందుకే ఆయన వాళ్లతో లాబీయింగ్ చేసి వైజాగ్ స్టీల్ ని కాపాడతారు. అంతేకానీ..నిరాహారదీక్షలు ఆయన వంటికి పడవు. 

ఎటూ వైఎస్ జగన్ కి ఆదరణ తగ్గింది , పార్ట ీపరిస్థితి ఘోరంగా తయారైంది కాబట్టే కొన్ని రోజుల్లో అసలు రఘరుమాల్ కృష్ణంరాజుకి పగ్గాలు  అప్పగిచ్చినా అప్పగించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఢిల్లీలో రచ్చబండ పేరుతో టివి ఛానళ్లతో ఏ సమస్యకైనా చిటికెల మీద పరిష్కారం చెప్పగల ఘనుడు కాబట్టి..ఇప్పటికే ఆయన ఫ్యాన్స్ ఉభయగోదావరి జిల్లాల్లో లక్షల సంఖ్యలో అభిమాన సంఘాలు పెట్టుకుని మరీ భజన చేస్తున్నాయ్. రా అన్నా నువ్ పార్టీకి రాజీనామా చేయ్ మేం నిన్ను పదిలక్షల మెజారిటీ తో గెలిపించుకుంటాం అంటున్నా..ఏ..నాకు నైతిక విలువలు ఉన్నాయి నేనలా చేయను అంటూ సర్ది చెప్పుకొస్తున్నారు. 


ఈ మధ్యన ప్రధానమంత్రి మోదీని కలిసింది కూడా అందుకేనట. రాష్ట్ర ప్రయోజనాల ముందు తనపై కేసులు ఓ లెక్క కాదని..ఆ మాటకి వస్తే అసలు తనపై కేసులే లేవని అనవసరంగా ఆర్బీఐ, సిబిఐ కోర్టులు హైరానా పడుతున్నాయి కానీ తన సంగతేంటో అందరికీ తెలుసుంటూ చెప్పారు. కాబట్టి ఇక విశాఖ పట్నం వాసులు హాయిగా తడి గుడ్డేసుకుని పడుకోచ్చు..ఎందుకంటే..రాజుగారు  రంగంలోకి దిగారు కదా..ఇక అన్నీ హాంఫట్ అన్నట్లుగా మాయం అవుతాయ్ సమస్యలు 


Comments