ఇందుకేనా ఈ తన్నుల గోల..! అరికాళ్ల కోటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదేనా! అయ్యమారాజా..ఇంత కథుంతా సామీ..!


ఆయనో తరాజు( కనీసం అలా ఆయనకి ఆయన అలా భావించుకుంటాడు) ఆయన తన పార్టీ అధినేతపై నిప్పులు చేటలో వేసి రోజూ చెరిగేవాడు ఐతే హఠాత్తుగా నేరచోర గూఢ నిఘాచర విభాగం అధికారులు ఆయనపై సుమోటోగా (  తమంతట తామే) కేసు పెట్టారన్నారు. అరెస్ట్ చేశారు ఐతే దీనివెనుక ప్రభుత్వాధినేతే ఉన్నారంటూ ఆయన వైరి పక్షం..ఈ ప్రజాప్రతినిధికి ఎనకపక్షం అయిన ఓ పార్టీ గగ్గోలు పెట్టింది..


పైగా తమ కస్టడీలో ఉండగానే ఐదుగురు ముసుగువీరులు తమపై దాడికి దిగారంటూ సదరు హగెంపీ గారు వాపోయారు. దీంతో అసలు మలుపు తిరిగింది కథ  యే..ఠాఠ్ మనోడు ఇంత రాచ్చసుడా..ఇలాగెందుకు సేసాడు..ఇలా తన్నించడమేంటి అంటూ చాలామంది ఎగిరిపడ్డారు..ఐతే ఆ ఆధినేత మాత్రం కించిత్ కూడా స్పందించలేదు

పైగా చిద్విలాసాలు ఎక్కువైయ్యాయ్ కూడా..! 


మనకి ఉన్న స మాచారం ప్రకారం సదరు పెజా పెతినిధి చరవాణిని  యాపిల్  తొక్క వలిపించి మరీ చూశారని తెలిసింది. ఢిల్లీ రిపోర్టర్ ఒకతను ఘంటాపథంగా 15 రోజుల క్రితమే ఈ విషయం చెప్పారు. ఐతే ఇంకా అనుమానవే..నిజంగానే కొట్టారా..ఎవరికీ ఏ ప్రత్యర్ధి పార్టీ నేతలకూ దక్కని కోటింగ్ ఈయనకే ఎందుకు వేయాల్సి వచ్చింది అని ఒకటే చర్చ.రకరకాల కారణాలు చెప్పారు..ఇందుకే అన్నారు..కాదు అసలు కొట్టలేదని మరి కొందరు ఇంకా వాదిస్తూనే ఉన్నారు


ఇంతలో అసలైన ట్విస్ట్ 


సీ వీ కెమేష్ అనే గొప్పోరు ట్విట్టర్ పిట్టలో ఓ ట్వీట్ వేశారు..హయ్యా నాకు మీ ఫోన్ నుంచి తెగ మెసేజులు వస్తున్నాయి ఏందిది అంటూ..యెంటనే సదరు పెజా పెతినిధి గారు హయ్యో నా చరవాణి నా దగ్గర లేనే లేదు..సిమ్ కూడా నాలుగు రోజుల క్రితం(  ఏదీ జంటనగరాల నుంచి దేశ రాజధానికి వచ్చిన నాలుగు రోజుల తర్వాత కానీ బ్లాక్ చేయలేదు.) బ్లాక్ చేశాను అని క్లారిటీ ఇచ్చారట..సదరు కెమేష్ గారు కూడా కెక్కేక్కే(  ok ok) అన్నారు...దీనిపై ఆయన ఎక్కడ ఏ కేసు పెట్టారో తెలీదు కానీ సదరు కేమెష్ గారు టివీ ఛానళ్లకి ఓ ట్వీట్ పెట్టారు నన్ను బురదలోకి లాగమాకండ్రా సామీ అని

పెముఖంగా ఎవరికి యెట్టారయ్యా అంటే అదే ఆ రెండు ఛానళ్లకే..


సీన్ ఇక్కడితో అయిపోలేదండీ..

సదరు నేర పరిశోధన విభాగం అధి్కారి ఉన్నాడే...ఏదీ ఎవరైతే సుమోటోగా కేసు పెట్టాడని అంటున్నారు..సదరు పునీలుడు..సహధర్మచారిణి పేరు కూడా బైటికి వచ్చిందండయ్యా..ఆమెకి ఆమె భర్తకీ పొసగడం లేదట..(ఇవన్నీ ప్రచారాలే) ఈ పడటం పడకపోవడాన్ని సర్దుబాటో..దిద్దుబాటో చేయడానికి ఇప్పుడు ఎవరైతే కోటింగ్ పడిందని కేసులు పెట్టారో సదరు ప్రజాప్రతినిధి గారే పెద్దరికం తీసుకున్నారనేది టాక్..కొద్ది కొద్దిగా మబ్బులు వీడుతున్నట్లు అన్పిస్తుందండయ్యా..సుమోటోగా కేసు పెట్టడం..తర్వాత బాదడం..వంటి కార్యక్రమాలకు ఈ మధ్యవర్తిత్వానికి ఏదైనా సంబంధం ఉందా..ఏమో మరి..! మనకైతే ఇప్పటికి తెలిసింది ఇంతే..! ఇక్కెడవరి పేరూ మనం చెప్పలేదు అన్నీ ఊహించుకోండి..ఎందుకంటే..సదరు కోటింగ్ కథలో కూడా ఎవరికి తోచిన అనుకూలమైన కోణం ఊహించుకుంటున్నాం కదా..!

Comments