NTPC షేర్లు వీకెండ్‌లో తోక తొక్కినతాచులా పైకి లేచాయ్. ఓపెన్ కావడం నిన్నటి ముగింపు కంటే తక్కువ రేటులోనే ప్రారంభమైనా, చివరి అరగంటలో మాత్రం పూనకాలొచ్చినట్లుగా ర్యాలీ చేశాయ్
ఇంట్రాడేలో అలా దాదాపు 4శాతం ర్యాలీ చేసి రూ.307రేటుని తాకాయ్
ఈ రేటు షేర్‌ఖాన్ అనే రీసెర్చ్ కంపెనీ చెప్పిన రూ.300 టార్గెట్ కంటే ఎక్కువ
ఇంట్రాడేలో వాల్యూమ్స్ కూడా భారీగా నమోదు అవుతున్నాయ్. నిన్న 3 కోట్ల షేర్లు ట్రేడవగా, ఇవాళ 2 కోట్ల షేర్లు ట్రేడ్ అయ్యాయ్. ఓ వైపు మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు తమ వాటా కాస్త తగ్గించుకున్నా...ఇతరత్రా అంశాలు ఫ్యూచర్ ప్రాస్పెక్టస్‌లో అద్భుతంగా అన్పించడంతో ఇన్వెస్టర్లు ఈ స్టాక్‌ని భారీగా డెలివరీ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది
స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి NTPC షేర్లు రూ.305.20 దగ్గర ట్రేడ్ అయ్యాయ్
మరోవైపు నిఫ్టీ కూడా 21450 మార్క్ దాటేసి ఇంకా పరుగు పెడుతోంది
Comments
Post a Comment