భారీ బ్లాక్ డీల్ ఎఫెక్ట్, మ్యాన్‌కైండ్ ఫార్మా 5% డౌన్



మ్యాన్ కైండ్ ఫార్మా షేర్లపై బ్లాక్ డీల్ ఎఫెక్ట్ పడినట్లు కన్పిస్తోంది. సంస్థలో తమకి ఉన్న వాటాలో

5 ఇన్వెస్ట్ మెంట్ సంస్థలు విక్రయిస్తుండటంతో..ఈ షేరు నాలుగున్నరశాతానికిపైగా నష్టపోయింది

ఇంట్రాడేలో రూ.1827.50కి పతనమై, కొద్దిగా కోలుకునే ప్రయత్నం చేస్తోంది


 5 ఇన్వెస్ట్‌మెంట్ స్టేక్ హోల్డర్ కంపెనీలైన బైగీ ఇన్వెస్ట్‌మెంట్, లింక్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్,కెయిన్‌హిల్ CIPEF

కెయిన్‌హిల్ CGPE, హేమా CIPEF కలిపి ఏడున్నరశాతానిపైగా వాటా విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంది

ఐతే ట్రేడ్ జరిగిన వాల్యూమ్ చూస్తే అంతకంటే ఎక్కువ సంఖ్యలోనే విక్రయం జరిగినట్లు కన్పిస్తోంది

ఈ నేపధ్యంలోనే ఈ స్టాక్ అల్లల్లాడుతోంది


ఈ బ్లాక్ డీల్స్ వేల్యూ రూ.6400కోట్లుగా అంచనా


స్టోరీ పబ్లిష్అయ్యే టైమ్‌కి మ్యాన్‌కైండ్ ఫార్మా షేర్లు రూ.1865 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments