గోల్డ్ బాండ్స్ కొనేద్దాం పదండి

 గోల్డ్ రష్ కంటిన్యూ అవుతోంది. ఐతే బంగారం కొనేందుకు ఇప్పుడు సరైన సమయమా.. అంటే

హై రేటులో కొనడం ఆభరణాల వరకూ ఓకే కానీ..ఇన్వెస్ట్‌మెంట్ పరంగా మాత్రం మరో ఆల్టర్నేటివ్ వే ఉంది

అది గోల్డ్ బాండ్స్..స్కీమ్ ఇప్పటికే బాగా సక్సెస్ అయింది.దీంతో ఆర్బీఐకి బోలెడంత ధనం...కొనేవాళ్లకి వడ్డీ గిట్టుబాటు

కావడమనే ఉభయతారకమంత్రం పని చేస్తోంది



ఆర్బీఐ సావరిన్ గోల్డ్ బాండ్స్ స్కీమ్ సిరీస్ IIIని విడుదల చేయగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో మూడో సారి విడుదల కానున్న ఈ స్కీమ్ సోమవారం -డిసెంబర్ 18 నుంచి

ఓపెన్ అవుతుంది. ఇప్పటికే స్పాట్ గోల్డ్ కేలండర్ ఇయర్‌లో పదిశాతం పెరిగాయ్. బేస్ రేటు రూ.6199గా ఉంచగా..ఆన్‌లైన్లో కొంటే గ్రాముకి 50 రూపాయలు తగ్గుతుంది

ఈ బాండ్లలో గ్రాము నుంచి గరిష్టంగా 4 కేజీల వరకు బంగారం కొనొచ్చు. 8 సంవత్సరాల కాల పరిమితితో ఉండే ఈ బాండ్లపై 2.50 శాతం ఫిక్స్‌డ్ రేటుతో వడ్డీ వస్తుంది


 గోల్డ్ బాండ్లపై గ్రాము ధరను ఇండియన్ బులియన్ జువెల్లర్స్ అసోసియేషన్-IBJA నిర్ణయిస్తుంటుంది,అదెలాగంటే, బాండ్ల జారీ ముందు వారంలో లాస్ట్  3 రోజుల బంగారం సగటు ధరను బట్టి ఈ వీటి రేటు ఉంటుంది. బాండ్లను కొనుగోలు చేసిన వారికి డిసెంబర్ 28న జారీ అవుతాయి.


ఈ గోల్డ్ బాండ్లను నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అలాగే నేరుగా బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో, స్టాక్ ఎక్స్చేంజీల్లో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. కాగా, నాలుగో సిరీస్‌ స్కీమ్‌ డేట్లు కూడా వచ్చేశాయ్.  వచ్చే ఏడాది ఫిబ్రవరి 12-16 మధ్య నాలుగో సిరీస్ సావరిన్ గోల్డ్ బాండ్స్ స్కీమ్ IV ఉండబోతోంది.

Comments