మార్కెట్లు అలుపెరగని ప్రయాణం చేస్తున్నాయ్. నిఫ్టీ
శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో 21355 పాయింట్లపైకి చేరగా, సెన్సెక్స్ 71వేల
పాయంట్లను అధిగమించింది. ఓ దశలో నిఫ్టీ ఈ ఏడాది చివరకు 20వేల పాయింట్లు
నిలబెట్టుకుంటే చాలు అనుకుంటే..ఇప్పుడు చూస్తే 22వేల పాయింట్ల దరిదాపుల్లో
ముగిసేలా ఉండటం..మార్కెట్ల గమనాన్ని ఎవరూ పసిగట్టలేరనే అంశానికి నిదర్శనంగా
మారింది
బ్యాంక్ నిఫ్టీ ప్లాట్‌గా ఉండగా, ఐటీ ఇండెక్స్ మరోసారి 4శాతం లాభపడింది.
ఎప్ఎంసిజి అరశాతం నష్టంతో, కేపిటల్ గూడ్స్ అరశాతం లాభంతో ఉండగా,
మిగిలిన రంగాలు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయ్
టాప్ గెయినర్లలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టిసిఎస్, హెచ్‌సిఎల్ టెక్, ఎల్టీఐ మైండ్
ట్రీ మూడు నుంచి నాలుగున్నరశాతం దంచిపారేశాయ్
HDFC లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, నెస్లే, బ్రిటానియా, భారతి ఎయిర్ టెల్ ఒకటి నుంచి
రెండుశాతంవరకూనష్టపోయాయ్
.jpeg)
Comments
Post a Comment