హైదరాబాద్ బేస్డ్ ఇంజనీరింగ్ కంపెనీ ఆజాద్ ఇంజనీరింగ్ ఐపిఓకి రెడీ అయింది. డిసెంబర్ 20 నుంచి ఇష్యూ ఓపన్ అయి డిసెంబర్ 22తో క్లోజ్ అవుతుంది.అన్నీ అనుకూలిస్తే..కొత్త ఏడాదిలోపే లిస్ట్ కావచ్చు కూడా..!
ప్రైస్ బ్యాండ్- రూ.499- రూ.524
ఇష్యూ సైజ్ -రూ.740కోట్లు
లాట్ సైజ్-28 షేర్లు-వేల్యూ-రూ.14672
గ్రే మార్కెట్ ప్రీమియం--74%
పై లెక్కలను బట్టి ఐపిఓ లిస్టింగ్ రోజున కనీసం రూ.924 రేటుతో ట్రేడ్ ప్రారంభం కావచ్చనేది అంచనా
క్రేజీ ఫ్యాక్టర్ ఏంటంటే..ఒకప్పటి లెజెండ్రీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఈ కంపెనీలో మైనర్ స్టేక్ తీసుకోవడం.కనీసం 2శాతం వాటా తీసుకున్నట్లుగా అంచనా
ఆజాద్ ఇంజనీరింగ్ ఏరోస్పేస్,డిఫెన్స్ రంగంలో టర్బైన్లతో పాటు ఎనర్జీ,గ్యాస్ అండ్ ఆయిల్ రంగంలోని కంపెనీలకు ఒరిజినల్ ఎక్విప్‌మెంట్
సరఫరా చేసే వ్యాపారంలో ఉంది

Comments
Post a Comment