ఆల్‌టైమ్ రికార్డుల మోత..ఇప్పట్లో ఆగేది కాదు

 



స్టాక్ మార్కెట్లు ఉదయం అంచనాలకు తగినట్లుగానే గ్యాప్అప్ ట్రేడ్‌తో ఓపెన్ అయింది

నిఫ్టీ ఏకంగా 250 పాయింట్లు లాభపడింది 21150 పాయింట్ల మార్క్ అధిగమించింది.21189 పాయింట్ల వరకూ వెళ్లి 21200 పాయింట్లను మిస్ చేసింది


సెన్సెక్స్ 70500 పాయింట్లపైకి లాంగ్ జంప్ కొట్టింది. దీంతో డిసెంబర్‌లో రెండో బిగ్గెస్ట్ గెయిన్ సాధించాయ్ మార్కెట్లు 70540 పాయింట్ల దగ్గర కొత్త గరిష్టాన్ని తాకింది


వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాలే ఈ భారీ ర్యాలీకి కారణం కాగా..మార్కెట్లలో శాంటాక్లాజ్ ర్యాలీ చాలా  ముందుగానే వచ్చేసినట్లు ఇప్పుడు ట్రేడర్లు ఫీలవుతున్నారు


బ్యాంక్ నిఫ్టీ మరోసారి దద్దరిల్లింది. 47943 పాయింట్లపైకి చేరి ఆల్‌టైమ్ రికార్డుల మోత మోగించింది. ఈ జోరు ఇంకా కొనసాగే సూచనలే కన్పిస్తున్నాయ్

Comments