గురువారం మార్కెట్లలో ఐటిఇండెక్స్ ఇరగదీస్తోంది. ఇప్పటికే నాలుగుశాతం వరకూ ఈ సెక్టార్
ర్యాలీ చేసింది. మిగిలిన అన్ని సెక్టార్లూ అరశాతంలోపే లాభంతో ఉండగా, ఆయిల్ అండ్ గ్యాస్
మెటల్ సెక్టార్లు ముప్పావుశాతం వరకూ లాభపడ్డాయి
టాప్ గెయినర్లలో ఎల్టీఐ మైండ్ ట్రీ, ఇన్పోసిస్,టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సిఎల్ టెక్
మూడు నుంచి నాలుగు శాతం లాభపడ్డాయి, Hdfc లైఫ్, పవర్ గ్రిడ్,బిపిసిఎల్, సిప్లా, నెస్లే
అరశాతం నుంచి రెండుశాతం లోపు నష్టపోయాయ్
మరోవైపు రోడ్లపై ప్రమోషన్ కార్యక్రమాలు,..కేటరింగ్ సదుపాయాలు విస్తరించే వ్యూహంలో ఉన్న
IRCTC షేర్లు 52వీక్స్ హై రేటు టచ్ చేశాయ్. ఇంట్రాడేలో రూ.799.95కిఎగసాయ్. ఇది ఆ స్టాక్
స్ప్లిట్ అయిన తర్వాత ఈ రేంజ్ రేటుకి రావడం బహుశా ఏ మూడో సారో నాలుగోసారో అయి ఉంటుంది కూడా..!

Comments
Post a Comment