2వేలు ఇంకా మార్చుకోవచ్చు తెలుసా...?..Something fishy..ఎవరడిగారు??





మీదగ్గర ఉంకా రూ.2వేల నోటు ఉంటే..దాన్ని మార్చుకోవడానికి ఆర్బీఐ మరో వెసులుబాటు ప్రకటించింది.పోస్టాఫీస్..ఆర్బీఐ రీజినల్ ఆఫీసుల్లో వీటిని మార్చుకోవచ్చు..ఐతే పోస్టాఫీస్‌లో మార్చుకోవడానికి ముందుగా ఆన్‌లైన్లో ఓ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని తీసుకుని..పోస్టాఫీస్ ద్వారా ఆర్బీఐలకు పంపించాల్సి ఉంటుంది

ఐనా ఇంకా ఇలా రూ.2వేల నోట్లు ఉన్నవి రూ.9330 కోట్లు మాత్రమేనంటూ చెప్పింది ఆర్బీఐ..!


రిజర్వ్‌ బ్యాంక్‌కు అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో ఇష్యూ ఆఫీసులున్నాయ్. వీటిలో రూ.2వేల నోట్లను మార్చుకోవచ్చు.


డెడ్‌లైన్ అక్టోబర్ 30 వరకే పెట్టినా..ఇప్పుడిలా అకస్మాత్తుగా ఇలా ఎందుకు మరో వెసులుబాటు కల్పించిందన్నది తెలీదు..అంతేకాదు..ఇలా ఆర్బీఐ కార్యాలయాలు,పోస్టాఫీసుల్లో ఏ తేదీ వరకూ మార్చుకోవచ్చనేది కూడా చెప్పలేదు

Comments