కేసీ ఎనర్జీ అండ్ ఇన్‌ఫ్రా ఐపిఓ ఈ రోజు లిస్ట్ అవడమే కాకుండా అంచనాలను మించిన లాభం
పంచి ఈ షేర్లు అలాటైనవారికి అన్ని పండగలు ఒకేసారి తీసుకువచ్చింది.
ఇష్యూ రేటు రూ.54 కాగా..ఏకంగా రూ.252 దగ్గర ట్రేడింగ్ ప్రారంభించి..కేక పుట్టించింది
ఐతే ఇది ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ కావడంతో..రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువమంది ఈ సెగ్మెంట్‌లో
పార్టిసిపేట్ చేయలేకపోయారు.
అసలు లిస్ట్ అవడానికి ముందు రోజు వరకూ కేవలం 162శాతం గ్రేమార్కెట్ ప్రీమియం ఉండగా
శుక్రవారం మాత్రం ఏకంగా 366శాతం పెరిగింది. Kay Cee ఎనర్జీ అండ్ ఇన్‌ఫ్రా పబ్లిష్ ఇష్యూకి
వచ్చినప్పుడు 959 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. రిటైల్ ఇన్వెస్టర్ల కేటగరీలో ఏకంగా 1300 రెట్లు
బిడ్లు దాఖలు అయ్యాయ్. ఇఁతా చేసి ఈ ఇష్యూ కేవలం 15.93 కోట్లది కావడం గమనార్హం.
29.50లక్షల షేర్లను అలాట్ చేసిన ఈ కంపెనీ ప్రమోటర్లు లోకేంద్ర జైన్,షాలిని జైన్..వచ్చిన డబ్బుని కేపిటల్ రిక్వైర్‌మెంట్లు,జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం వినియోగిస్తున్నట్లు ఇష్యూ సమయంలో చెప్పారు
ఈ కంపెనీ రాజస్తాన్ బేస్డ్ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్‌స్ట్రక్షన్ వ్యాపారం ఎక్కువ చేస్తుంది. అలానే పవర్ ట్రాన్స్‌మిషన్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ ఉంది
లిస్టైన తర్వాత కేసీ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రా ఇంకా దంచికొట్టి రూ.264.60కి వెళ్లాయ్. స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి రూ.239.40 దగ్గర ట్రేడ్ అయ్యాయ్
Comments
Post a Comment