ఓ 100 కోట్ల కాంట్రాక్ట్ దక్కించుకున్న ఉత్సాహంలో జూపిటర్ వేగన్స్ కొత్తవారాన్ని ర్యాలీతో షురూ చేసింది.ఇంట్రాడేలో ఈ స్టాక్ రూ.358.80 వరకూ పెరిగింది. ఇది గత ముగింపు కంటే నాలుగున్నరశాతం ఎక్కువ
వివిద ఆటోమొబైల్ తయారీ కంపెనీల నుంచి ఈ వందకోట్ల ప్రాజెక్టులు దక్కగా, వాటిలోనే 4 ర్యాక్‌ల ఆటోమొబైల్ కారియర్ వేగన్లు తయారీ కూడా ఇమిడిఉందని చెప్తున్నారు.
ఈ స్టాక్ గత ఆరునెలలలోకాలంలోనే వందశాతం దంచికొట్టింది. 200 రూపాయల రేటు నుంచి ఏకంగా 400కి కూడా ఎగబాకింది
ప్రస్తుతం జూపిటర్ వేగన్స్ షేరు రూ.354.90 దగ్గర ట్రేడ్ అయింది

Comments
Post a Comment