చైనా తర్వాత మనమే..తైవాన్ ని బీట్ చేసిన ఇండియా




MSCI ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్‌లో మన ర్యాంక్ భారీగా పెరిగింది. వెయిటేజ్ ప్రకారం 20శాతం ఎక్కువ నమోదు కాగా ఎఫ్ఐఐలు స్టెడీగా మన మార్కెట్లలోకి ఫండ్స్ పంప్ చేస్తుండటమే ఇందుకు కారణంగా మారింది. ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు ,డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్ చాలా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని ఇంటర్నేషనల్ ఏజన్సీ జెఫ్రీస్ కూడా ఈ సందర్భంగా కితాబు ఇచ్చింది. 

పొలిటికల్ స్టెబిలిటీతో పాటు ఇన్వెస్ట్‌మెంట్ సైకిల్స్, వడ్డీ రేట్లు MSCIలో మన  వెయిటేజ్,ర్యాంక్ పెరగడానికిదోహదపడుతున్నట్లుగా జెఫ్రీస్ చెప్తోంది. 


2H21-1H22 నుంచి $33 బిలియన్ల మేర పెట్టుబడులు వెనక్కి పోగా.. ఆ తర్వాత గణనీయమైన మార్పు చోటు చేసుకుంది.గత పదకొండేళ్లలో లేని విధంగా మన మార్కెట్లలోకి FII,FPI ఫండ్స్ వచ్చి పడ్డాయ్. ఇది ఇంకా పెరుగుతుందని జెఫ్రీస్ అంచనా వేసింది


Comments