అమ్మయ్య మినిమమ్ బ్యాలెన్స్ బెడద లేదు

ఆర్బీఐ నిన్న రెండు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఈ రోజుకి ఇది పాతబడిపోయినా..చాలామందికి ఇది  తెలియాల్సిన అవసరం ఉంది. ఒకటి..బ్యాంక్ ఖాతాల్లో మనం మినిమమ్ అమౌంట్ మాత్రమే కాదు..కొన్నేళ్లుగా

కొన్ని అక్కౌంట్లలో ట్రాన్సాక్షన్సే జరపం..అలాంటివాటిపై బ్యాంకులు ఫైన్ వేస్తుంటాయ్..ఏ కాస్త డబ్బు డిపాజిట్ చేసినా వెంటనే రకరకాల జరిమానాలు..ఛార్జీల పేరుతో వేసిన మొత్తం మాయమైన సంఘటనలూ ఉన్నాయ్



ఐతే ఇకపై అలాంటి నిరుపయోగ ఖాతాలపై ఛార్జీలు వేయవద్దని ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. 


అలానే స్కాలర్ షిప్స్, డైరక్ట్ బెనిఫిషియరీ స్కీముల అక్కౌంట్లపైనా ఇలాంటి జరిమానాలు వేయవద్దని స్పష్టంగా డైరక్షన్స్ ఇచ్చింది..సో..ఇప్పుడు మన పాత ఖాతాలు పదిలం అనే అనుకోవాలి

Comments